Calcium Rich Ladoo : ఎముకల బలానికి ‘కాల్షియం లడ్డు’.. కేవలం 90 క్యాలరీలతో ఇంట్లోనే ఇలా చేసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మందిని వేధించే ప్రధాన సమస్య ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో తగినంత కాల్షియం లేకపోవడమే. సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం అంటే రుచిగా ఉండదని, రుచికరమైన స్వీట్లు అంటే ఆరోగ్యానికి హానికరమని మనం భావిస్తుంటాం. కానీ, తీపి తినాలనే కోరికను తీర్చుకుంటూనే శరీరానికి కావాల్సిన కాల్షియంను అందించే ఒక అద్భుతమైన రెసిపీ ఒకటి ఉంది. అది కూడా కేవలం 90 క్యాలరీలతో ఎముకల పుష్టిని పెంచడమే కాకుండా, ఎంతో రుచిగా కూడా ఉంటాయి. ఆ హెల్తీ రెసిపీ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఆరోగ్యం అంటే కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం కూడా. ముఖ్యంగా ఎముకల పుష్టి కోసం కాల్షియం ఎంతో అవసరం. సాధారణంగా తీపి పదార్థాలంటే నెయ్యి, చక్కెర ఎక్కువగా ఉంటాయని భయపడే వారి కోసం.. ఈ ‘కాల్షియం బాల్స్’ లడ్డూలు ఎముకల ఆరోగ్యానికే కాకుండా, కీళ్ల నొప్పుల నివారణకు, హార్మోన్ల సమతుల్యతకు, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి కావలసిన పదార్థాలు.. తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం..
Also Read
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
కావలసిన పదార్థాలు:
అర టేబుల్ స్పూన్ నెయ్యి , ముప్పావు కప్పు నల్ల నువ్వులు, ఒక కప్పు తామర గింజలు (మఖానా) , అర కప్పు గుమ్మడి గింజలు, వాల్‌నట్స్ (అక్రూట్లు) – 10 నుంచి 12, 2 టేబుల్ స్పూన్లు (ఆప్షనల్) కిస్‌మిస్, 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తురుము, అంజీర్ – 8 నుంచి 10 (రుచికి తగినట్టుగా), 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు.
వీటి తయారీ విధానం :
ముందుగా నల్ల నువ్వులు, గుమ్మడి గింజలు, వాల్‌నట్స్, ఎండు కొబ్బరిని దోరగా వేయించి, కొద్దిగా నెయ్యి కలిపి ‘నట్-బటర్’ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో తీపి కోసం అంజీర్ కలిపి, విడిగా వేయించి పొడి చేసిన మఖానా (తామర గింజలు) మిశ్రమాన్ని చేర్చాలి. చివరగా కిస్‌మిస్, తెల్ల నువ్వులు కలిపి చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకుంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన కాల్షియం లడ్డు సిద్ధం. రోజుకు ఒకటి చొప్పున వీటిని తీసుకుంటే శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, జింక్ అందుతాయి.
గమనిక (Disclaimer):అందరి శరీర తత్వాలు ఒకేలా ఉండవు, కాబట్టి ఏదైనా కొత్త డైట్ లేదా రెసిపీని అనుసరించే ముందు మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి పోషకాహార నిపుణులు (Nutritionist) లేదా వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!