Site icon NTV Telugu

Health Tips: ఆహరం తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందా! ఈ తప్పులు చేయకండి!

Stomch

Stomch

డైలీ తీసుకునే ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. పౌష్టికాహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. అయితే ఆహారం తీసుకునేటప్పుడు చాలా మంది తప్పులు చేస్తుంటారు. వేగంగా తినడం, పూర్తిగా నమలకుండా తీసుకోవడం, తేలికగా జీర్ణం కాని ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు. దీంతో ఆహారం తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ తప్పులు చేయొద్దని సూచిస్తున్నారు నిపుణులు.

చాలా మందికి కొంచెం ఆహరం తీసుకున్నా కానీ.. కడుపు నిండుగా అనిపిస్తూ ఉంటుంది. మరికొందరికి ఎక్కువ ఆహారాన్ని తినడం వలన కానీ, వేగంగా తినడం వలన కానీ.. ఇలా అనిపిస్తూ ఉంటుంది. కడుపు ఉబ్బరాన్ని పట్టించుకోక పోతే.. దీర్ఘకాలంలో ఇది అనేక సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. ఆహరం తీసుకునే ముందు కానీ, తర్వాత కానీ అధికంగా పండ్లను తినకూడదు. దీని వలన కడుపులో గ్యాస్ అనేది ఫార్మ్ అయ్యి.. కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుంది. అలాగే చాలా మంది తిన్న వెంటనే వాకింగ్ చేస్తూ ఉంటారు. అలా చేస్తే ప్రమాదమే.. తిన్న వెంటనే కాకుండా.. తిన్న పది నిమిషాల తర్వాత వాకింగ్ చేయడం వలన ప్రయోజనం ఉంటుంది.

అలాగే తిన్న తర్వాత సోడాలు, కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటె మానుకోవాలి. ఎందుకంటే వాటిలో కార్బన్ డయాక్సైడ్ ఉండడం వలన అవి కడుపులో గ్యాస్ ఫార్మ్ చేస్తాయి. అలాగే తినే సమయంలో బాగా నములుతూ తినాలి.. కనీసం 32సార్లు నమిలి తినాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే, రాత్రి సమయాల్లో తేలికగా జీర్ణం అయ్యే ఆహార పదార్ధాలను తీసుకోవాలి. క్యాలి ఫ్లవర్, క్యాబేజి, ఉల్లిపాయ, వెల్లుల్లి, బటానీలు, దుంపలు ఇలాంటి ఆహారపదార్ధాలను రాత్రి సమయాల్లో తినకపోవడం మంచిది.

Exit mobile version