Winter Health Tips: మంచు దుప్పటిలా పేరుకునే చలి, దాన్ని చీల్చుకుంటూ చుర్రున తగిలే ఎండ…కాలాలన్నింటిలోనూ ఈ కాలం ప్రత్యేకమే. ఈ కాలంలో చక్కని ఆహ్లాదాన్ని, సోయగాన్ని పంచడమే కాదు….సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతే అనారోగ్య సమస్యలూ ఎక్కువే. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
* ఉదయాన్నే వాకింగ్ చేయడానికి వెళ్లేవారు తప్పనిసరిగా చలిగాలుల్ని తట్టుకునేలా చర్మాన్ని కప్పి ఉంచే ఉన్ని దుస్తుల్ని వేసుకోండి. వాహనాలు నడిపే మహిళలు తప్పనిసరిగా చేతులకు గ్లవుజులు, సాక్స్లు వంటివి ధరించడం తప్పనిసరి. ఇవి చలిబారిన పడకుండా కాపాడతాయి.
Read also: MBBS in Hindi: స్టూడెంట్స్కు గుడ్ న్యూస్.. హిందీలోనూ ఎంబీబీఎస్ కోర్స్ చదివే అవకాశం
* కొందరు ఈ కాలంలో ఆస్తమా, జలుబూ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా చిన్నారులు. దీనికితోడు ఏ పని చేయాలన్న బద్ధకంగా ఉంటుంది. ఇలాంటప్పుడు ముసుగు కప్పుకుని పడుకునే కంటే కాసేపు ఎండకు అటూ, ఇటూ నడవండి. పిల్లల్నీ ఉదయంపూట ఎండలో కాసేపు ఆడుకోనీయండి. ఇలా చేయడం వల్ల వారూ చురుగ్గా మారతారు.
* చలికాలం నీళ్లు తాగబుద్ధి కాదు. ఇలాంటప్పుడు చల్లటి నీళ్లను తీసుకునే కంటే నీళ్లు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. వాతావరణం చల్లగా ఉందని నీళ్లు తక్కువ తాగొచ్చనుకోవడం పొరబాటే. ఈ కాలంలో అరుగుదల సమస్య ఎక్కువే ఉంటుంది. అందుకే వీలైనంత వరకూ వేడివేడిగా ఉండే తాజా ఆహారపదార్థాలను తీసుకోవడం మంచిది. ఆకుకూరలు, కాయగూరలు సమపాళ్లలో శరీరానికి అందేట్లు చూసుకోండి.
* ఈకాలంలో శరీరం పొడిబారడం, కాలిపగుళ్లూ ఇబ్బందిపెడతాయి. ఇలాంటప్పుడు రోజూ రాత్రిపూట కొబ్బరినూనెను వేడిచేసి దానికి చెంచా పసుపు కలిపి రాసి అరికాళ్లల్లో మర్దన చేయాలి. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. సమస్య దూరమవుతుంది. అంతేకాదు రోజూ స్నానం చేసే నీళ్లలో చెంచా తేనె, రెండు చుక్కల గులాబీ నీరు కలిపి స్నానం చేయడం వల్ల పొడిబారే సమస్య అదుపులో ఉంటుంది.
Mulayam Singh Yadav: రెజ్లింగ్ నుంచి రాజకీయాల్లోకి.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా..