Site icon NTV Telugu

Baby Bathing Tips: పసిపిల్లలకు స్నానం ఎప్పుడు చేయించాలి, ఎలా చేయించాలి..?

Pillalaki Snamam

Pillalaki Snamam

Baby Bathing Tips: పసిపిల్లల సంరక్షణలో స్నానం చేయించడం చాలా కీలకమైన భాగం. కొత్తగా పుట్టిన బిడ్డకు స్నానం విషయంలో తల్లిదండ్రులకు ఎన్నో అనుమానాలు ఉంటాయి. సరైన సమయంలో, సరైన విధానంలో స్నానం చేయిస్తే బిడ్డ ఆరోగ్యం, చర్మ సంరక్షణ రెండూ మెరుగ్గా ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, పిల్లలకు స్నానం ఎలా చేయించాలి, ఏ సమయంలో చేయించాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also: Chandrababu and Pawan Kalyan: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక భేటీ.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..!

స్నానం ఎప్పుడు చేయించాలి?
అయితే, కొత్తగా పుట్టిన వెంటనే పసిపిల్లకు స్నానం చేయించొద్దు.. సాధారణంగా డాక్టర్లు 24 గంటల నుంచి 48 గంటల తర్వాత లేదా ఇంటికి తీసుకెళ్లిన అనంతరం స్నానం చేయించమని సూచిస్తారు. కాగా, పుట్టిన బిడ్డ చర్మంపై ఉండే వెర్నిక్స్ అనే సహజ పొర చర్మాన్ని చలి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే ఆ పొర సహజంగా తగ్గే వరకు స్నానం చేయించకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, నాభి తాడు పూర్తిగా ఎండిపోయి ఊడిపోయే వరకు పూర్తిస్థాయిలో స్నానం చేయించకుండా స్పాంజ్ బాత్ మాత్రమే చేయించాలి అని పేర్కొంటున్నారు.

ఎలా స్నానం చేయించాలి?:
* పిల్లలకు స్నానం చేసే ముందు గదిని వెచ్చగా ఉంచాలి.. గాలి ఎక్కువగా ఉండకూడదు.
* నీరు గోరువెచ్చగా ఉండాలి.. మీ మణికట్టు లేదా మోచేతితో నీటి వేడి పరీక్షించాలి..
* మృదువైన గుడ్డను నీటిలో ముంచి, ముందు ముఖం, కళ్ళు, చెవులు శుభ్రం చేయాలి.. అనంతరం చేతులు, కాళ్లు, శరీరం మెల్లగా తుడవాలి..
* బేబీకి ప్రత్యేకంగా తయారు చేసిన మైల్డ్ సబ్బు లేదా క్లీన్సర్ మాత్రమే ఉపయోగించాలి. రోజూ సబ్బు అవసరం లేదు..
* స్నానం చేసిన వెంటనే మృదువైన టవల్‌తో తుడిచి, బేబీ ఆయిల్ లేదా మాయిశ్చరైజర్ రాయాల్సి ఉంటుంది.
* పసి పిల్లలకు వారానికి 2 నుంచి 3 సార్లు స్నానం చేయిస్తే బెటర్. పిల్లలకు రోజూ స్నానం చేయించాల్సిన అవసరం లేదు.

Read Also: Varanasi : ఆ ఒక్క షాట్ కోసం ఆరు నెలల ట్రైనింగ్ తీసుకున్నాను.. ఆ కష్టం మాటల్లో చెప్పలేను.. మహేష్ బాబు కామెంట్స్

ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే:
* స్నానం సమయంలో బిడ్డను ఎప్పుడూ ఒంటరిగా విడిచి పెట్టొద్దు..
* స్నానం సమయం 5 నుంచి 10 నిమిషాల లోపే ఉండేలా చూసుకోవాలి..
* ఎక్కువ సబ్బును పెట్టడం లేదా వేడి నీటిని ఉపయోగించకూడదు.. ఎందుకంటే, పసిపిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి స్నానం సమయంలో జాగ్రత్తతో పాటు ఓపిక చాలా అవసరం.. ఏవైనా అనుమానాలు ఉంటే తప్పకుండా పసిపిల్లల వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం..

 

Note: <p style=”font-size: 10px;”><span style=”color: red;”>నోట్ :</span> ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాం.. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు.కామ్ బాధ్యత వహించదు.</p>

Exit mobile version