NTV Telugu Site icon

Healthy water: మినరల్ వాటర్, డిస్టిల్డ్ వాటర్ మధ్య తేడా ఏంటి? డిస్టిల్డ్ వాటర్ తాగితే ఎం అవుతుంది..?

Untitled 7

Untitled 7

Health: భూమి మీద బ్రతికే ప్రతి ప్రాణికి నీరు చాల అవసరం. నీరు లేకుండా ఏ ప్రాణి మనుగడ సాగించలేదు. అయితే ప్రస్తుత కాలంలో పెరిగిన కాలుష్యం కారణంగా సహజ సిద్ధంగా లభించే నీటిని అలానే తాగితే లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే చాలామంది మినరల్ వాటర్ అంటూ శుద్ధి చేసిన నీటిని వినియోగిస్తున్నారు. అయితే మనం మినరల్ వాటర్ అని కొనే ప్రతి బాటిల్ లో మినరల్ వాటర్ ఉంటుందా? లేక వేరే ఏదైనా వాటర్ ని మినరల్ వాటర్ అనుకుంటున్నామా? ఇప్పుడు తెలుసుకుందాం.

Read also:rainy season food : వర్షాకాలంలో ఎలాంటి ఆహరం తీసుకోవాలి..?

మనం నిత్యం మినరల్ వాటర్ ని కొంటుంటాం. అయితే మినరల్ వాటర్ అని అమ్మే ప్రతి బాటిల్ మినరల్ వాటర్ కాదు. మినరల్ వాటర్ పేరుతో డిస్టిల్ వాటర్ ని అమ్ముతుంటారు. కనుక కొనేటప్పుడు చూసి కొనాలి. అసలు మినరల్ వాటర్ కి డిస్టిల్డ్ వాటర్ కి తేడా ఏంటి? భూగర్భ వనరుల నుండి నీటిని తీసుకుని, వాటిని శుద్ధి చేసి కావాల్సిన మినరల్స్ ని కలుపుతారు.. అనంతరం ఆ నీటిని ప్యాక్ చేసి సహజ మినరల్ వాటర్‌గా విక్రయిస్తారు. ఈ నీటిలో ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అయితే డిస్టిల్ వాటర్ అనేది ఏదైనా నీటిని వనరు నుండి నీటిని తీసుకుని ఆ నీటిని ఆవిరిగా మారే వరకు వేడి చేస్తారు. ఆ తరువాత ఆ ఆవిరిని చల్లబరిచి మళ్ళీ నేరుగా మారుస్తారు. ఇందులో సూక్ష్మ క్రిములు ఉండవు. అయిన ఈ నీరు తాగకూడదు. ఎందుకంటే ఇందులో కావాల్సిన మినరల్స్ ఉండవు. అంతేకాదు అనవసరమైన ఖనిజాలు ఉంటాయి. ఈ నీటిని తాగడంవల్ల ఆరోగ్యం పాడవుతుంది.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.