Weight Loss Tablets: లావుగా ఉన్నవారికి గుడ్ న్యూస్.. వెయిట్ లాస్ డ్రగ్ అమ్మకాలు షూరు.. ఆ మ్యాజిక్ పిల్ కథేంటో చూడండి!
- మెడికల్ షాపుల్లోకి బరువు తగ్గే మ్యాజిక్ టాబ్లెట్..
- యూకేలో ‘వెగోవి’ సేల్స్ షురూ..
- ఇంజక్షన్లకు ఎండ్ కార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weight Loss Tablets: పెరుగుతున్న బరువుతో, ఊబకాయంతో బాధపడుతున్న వారికి వైద్య రంగం సరికొత్త గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వెయిట్ లాస్ ఇంజక్షన్ ‘వెగోవి’ (Wegovy) ఇప్పుడు టాబ్లెట్ రూపంలో అందుబాటులోకి వచ్చేసింది. బ్రిటన్ (UK) లోని ప్రముఖ మెడికల్ స్టోర్లతో పాటు ఆన్లైన్ ఫార్మసీలలో ఈ బరువు తగ్గించే టాబ్లెట్ల విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతానికి ఇవి కేవలం ప్రైవేట్‌గానే లభిస్తున్నాయి, అక్కడి ప్రభుత్వ ఉచిత ఆరోగ్య సేవ (NHS) పరిధిలోకి ఇంకా రాలేదు. ఇంతకీ ఈ కొత్త మ్యాజిక్ పిల్ ఎలా పనిచేస్తుంది? దీని ధర, సైడ్ ఎఫెక్ట్స్, వాడాల్సిన విధానం ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇంజక్షన్‌కు.. టాబ్లెట్‌కు తేడా ఏంటి
ఇప్పటివరకు బరువు తగ్గడానికి ‘వెగోవి’ ఇంజక్షన్లను (స్కినీ జాబ్) వారానికి ఒకసారి వాడేవారు. ఇప్పుడు వచ్చిన టాబ్లెట్లలో కూడా అదే ‘సెమాగ్లుటైడ్’ (Semaglutide) అనే కెమికల్ కాంపోనెంట్ ఉంటుంది. ఇంజక్షన్ల భయం ఉన్నవారికి ఈ టాబ్లెట్ ఒక అద్భుతమైన ఆప్షన్‌గా పని చేస్తాయి. అయితే, ఇంజక్షన్ వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది, కానీ టాబ్లెట్‌ను మాత్రం రోజుకు ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది. క్లినికల్ ట్రయల్స్ ప్రకారం.. ఈ రెండు రూపాలు కూడా బరువు తగ్గించడంలో సమానంగా, అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తేలింది.
Also Read
- Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. 'మునగాకు పొడి'.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
- Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది? ప్రతి సెకను ఎందుకు కీలకం?
- Cancer: వాసనతో కుక్క క్యాన్సర్‌ను గుర్తించగలదా? సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
టాబ్లెట్ ఎలా వేసుకోవాలి?
ఈ టాబ్లెట్ శరీరంలో సరిగ్గా కరిగి, పూర్తి ఫలితాన్ని ఇవ్వాలంటే కొన్ని కఠినమైన నియమాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
* ఖాళీ కడుపుతోనే వేసుకోవాలి: టాబ్లెట్ వేసుకోవడానికి ముందు కనీసం 8 గంటల పాటు ఏమీ తినకూడదు (ఉదయాన్నే పరగడుపున వేసుకోవడం ఉత్తమం).
* నీరు మాత్రమే: ఈ టాబ్లెట్‌ను కేవలం 120ml నీటితో మాత్రమే మింగాలి. టీ, కాఫీ లేదా ఇతర పానీయాలతో అస్సలు తీసుకోకూడదు.
* అరగంట గ్యాప్: టాబ్లెట్ వేసుకున్న తర్వాత కనీసం అరగంట (30 నిమిషాలు) వరకు ఎలాంటి ఆహారం గానీ, మంచినీళ్లు గానీ తీసుకోకూడదు.
* ఒకే సమయం: ప్రతిరోజూ ఒకే నిర్ణీత సమయానికి ఈ టాబ్లెట్ వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ఏ రోజైనా మర్చిపోతే, ఆ రోజు డోస్ వదిలేసి మరుసటి రోజు ఎప్పటిలాగే వేసుకోవాలి.
ఎవరు వాడాలి? ఎవరు వాడకూడదు?
ఈ టాబ్లెట్ అందరికీ విచ్చలవిడిగా ఇచ్చేది కాదు. దీనికోసం కచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30 అంతకంటే ఎక్కువ ఉన్నవారు, లేదా BMI 27-30 ఉండి టైప్-2 డయాబెటిస్, హై బీపీ వంటి సమస్యలతో బాధపడేవారు దీనిని వాడవచ్చు. 18 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఈ టాబ్లెట్‌ను అస్సలు వాడకూడదు.
సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..
ఈ మెడిసిన్ శరీరంలో ఆకలిని నియంత్రించే ‘GLP-1’ అనే హార్మోన్ లాగా పనిచేస్తుంది. దీనివల్ల కడుపు నిండినట్లు అనిపించి, తక్కువ తింటారు. అయితే దీనివల్ల కొన్ని సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. వికారం, వాంతులు, మలబద్ధకం, విరేచనాలు వంటి జీర్ణక్రియ సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో తలనొప్పి, కడుపునొప్పి, తీవ్రమైన అలసట కనిపించవచ్చు. చాలా అరుదైన కేసుల్లో బ్లడ్ షుగర్ పడిపోవడం, ప్యాంక్రియాటైటిస్ లేదా తీవ్రమైన అలెర్జీలు రావచ్చని పేర్కొన్నారు.
డోస్ – ధరల వివరాలు..
ఈ చికిత్సను మొదట తక్కువ డోస్‌తో అంటే.. మొదటి నెల రోజుకు 1.5mg టాబ్లెట్‌తో ప్రారంభిస్తారు. ఆ తర్వాత డాక్టర్ సలహా మేరకు నెమ్మదిగా పెంచుకుంటూ గరిష్టంగా రోజుకు 25mg వరకు డోస్ పెంచుతారు. బ్రిటన్ మార్కెట్లో ప్రస్తుతం ప్రారంభ డోస్ (1.5mg) ఒక నెల కోర్సు ధర £99 (సుమారు రూ. 10,500) గా ఉంది. అదే గరిష్ట డోస్ (25mg) ఒక నెల కోర్సు ధర £199 (సుమారు రూ. 21,000) వరకు విక్రయిస్తున్నారు. లాంగ్ రన్లో ఈ టాబ్లెట్లు ఇంజక్షన్ల కంటే చౌకగా మారే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. 64 వారాల పాటు జరిగిన ఒక రీసెర్చ్ ట్రయల్‌లో.. తక్కువ క్యాలరీల డైట్, ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఈ ‘వెగోవి’ టాబ్లెట్ వాడిన వారిలో సగటున 13.61% బరువు తగ్గినట్లు తేలింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుసాన్ జెబ్ అభిప్రాయం ప్రకారం.. బీపీ, కొలెస్ట్రాల్ మందుల లాగే వీటిని కూడా లాంగ్ టర్మ్ వాడవచ్చు. అయితే బరువు తగ్గడానికి కేవలం మందులపైనే పూర్తిగా ఆధారపడటం కరెక్ట్ కాదని, సరైన డైట్, వ్యాయామం కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. మార్కెట్లో నకిలీ వెగోవి టాబ్లెట్ల అమ్మకాలు కూడా జరిగే ప్రమాదం ఉందని, కాబట్టి గుర్తింపు పొందిన ఫార్మసీల నుంచే వీటిని కొనాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
-
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
-
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!