Walking is better than running: వ్యాయామంలో భాగంగా నడవడం, పరిగెత్తడం గుండె వ్యాధులను తగ్గిస్తాయి. రన్నింగ్, వాకింగ్ గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతాయి. ఇలాంటి వ్యాయామాలు ఊపిరిని గట్టిగా పీల్చుకునేలా చేస్తాయి. ఇలాంటి సమయాల్లో గుండె వేగంగా కొట్టుకుంటుంది. వేగంగా శరీర భాగాలకు రక్తాన్ని పంప్ చేస్తుంది. ఈ క్రమంలో ధమనుల్లో ఉన్న అవాంతరాలను తొలగిపోతాయి. కార్డియో వర్కవుట్ చేయడం వల్ల శరీరంలో షుగర్ అదుపులో ఉంటుంది, మెరుగైన మెరుగైన జ్ఞాపకశక్తి, ఆరోగ్యవంతమైన కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇవన్నీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Read Also: Urfi Javed Tweet: ‘నన్ను క్షమించండి.. ఇక నుంచి బట్టలు వేసుకుంటా’
రన్నింగ్, వాకింగ్ రెండూ కూడా గుండె ఆరోగ్యానికి మంచివే. అయితే చాలా మంది కార్డియాలజిస్టులు వాకింగ్ లేదా వేగంగా వాకింగ్ చేయడం వైపు మొగ్గు చూపిస్తుంటారు. డాక్టర్ నాష్ కామ్ డిన్ ప్రకారం.. పరుగు కన్నా నడక శరీరానికి తక్కువ ఒత్తడిని కలిగిస్తుంది. రన్నింగ్ మీ గుండె కండరాలపై కొంత ఒత్తిడిని పెంచుతుంది కానీ అకాల మరణాలను అరికట్టడాన్ని తగ్గించదు. అయితే చురుకైన నడక గుండెపై ఒత్తిడి తగ్గించడంతో పాటు అకాల మరణ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని డాక్టర్ కామ్ డిన్ వెల్లడించారు.
2013లో 33,060 మంది రన్నర్లు మరియు 15,045 మంది నడిచేవారిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో రన్నింగ్ కన్నా వాకింగ్ చేసినవారిలో గుండె జబ్బుల ప్రమాదం సమర్థవంతంగా తగ్గినట్లు తేలింది. మొదటిసారి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం రన్నింగ్ వల్ల 4.2 శాతం, వాకింగ్ ద్వారా 7.2 శాతం తగ్గిందని పరిశోధకులు కనుగొన్నారు. ఇంతే కాకుండా నడక మోకాలు, చీలమండలం, వెన్నుపూస సమస్యలు ఉన్నవారికి, ఉబకాయం ఉన్నవారు బరువు తగ్గేందుకు సహాయపడినట్లు కనుగొన్నారు.