Site icon NTV Telugu

Tulsi Milk Benefits: తులసి పాలు తాగితే ఆ..సమస్యకు చెక్‌

Tulasi Milk

Tulasi Milk

Tulsi Milk Benefits: తులసి మొక్కకు ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత ఉంది. ఇక మరోవైపు ఆరోగ్యపరంగా కూడా తులసి మొక్క అద్భుతమైన ఔషధం. ఈ తులసి ఆకులను వివిధ రకాల ఆయుర్వేద ఔషధాల్లో వినియోగిస్తారు. తులసి ఆకులు సరే..మరి తులసి పాల గురించి విన్నారా? తులసి, పాలు రెండూ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఈ రెండింటినీ కలిపి తాగడం వల్ల సూపర్ టానిక్‌గా పనిచేస్తుంది. ఈ ఆకుల్ని పాలతో కలిపి ఉడికించి తాగితే చాలా రకాల వ్యాధుల్నించి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే తులసి మొక్కకు ఆధ్యాత్మికంగా ఎంత ప్రాధాన్యత ఉందో..ఆరోగ్యపరంగా అంతకుమించిన ప్రాధాన్యత ఉంది. దీనికి అందుకే చాలా రకాల ఆయుర్వేద ఔషధాల్లో తులసి మొక్క ఆకుల్ని వినియోగిస్తారు.

Read also: Tollywood: నటుడు, సీనియర్ జర్నలిస్ట్ మురళీ కన్నుమూత!

అక్టోబర్‌ నుంచే చలిలం ప్రారంభమైంది. వ్యాధులు ఎక్కువగా ప్రబలుతుంటాయి. చలికాలంలో అంటువ్యాధుల ముప్పు అధికంగా ఉంటుంది. ఈనేపథ్యంలో తులసి ఆకుల్ని పాలలో ఉడికించి తాగడం వల్ల జలుబు, దగ్గు వంటివాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు.. శరీరం ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది..తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇక, శరీరం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మనకు పని ఒత్తిడి, కుటుంబ టెన్షన్‌ల మధ్య గత కొద్దికాలంగా అందరిలో డిప్రెషన్ ముప్పు పెరుగుతోంది. మానసిక ఒత్తిడికి లోనవుతున్న వారు తులసి పాలు యాంటీ డిప్రెషన్‌లా పనిచేస్తుంది. ఈపాలు తాగడం వల్ల ఆందోళన, ఒత్తిడి దూరమౌతాయి. పని ఒత్తిడి పెరుగుతున్న ఏదైనా తెలియని వ్యాధి కారణంగా తలెత్తే తలనొప్పి సమస్యకు తులసి పాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక రోజూ తలనొప్పి సమస్య వేధిస్తుంటే తులసి పాలు సమూలంగా తగ్గిస్తాయి. ఒకటిన్నర గ్లాసు పాలలో 8-10 తులసి ఆకుల్ని వేసి ఉడికించాలి. దానిని తరువాత గోరువెచ్చగా చేసుకుని తాగాలి. దీనివల్ల ఉపశమనం ఉంటుంది.
Shahid Afridi: అక్తర్, షమీ వ్యవహారంపై స్పందించిన షాహీద్ అఫ్రిది.. ద్వేషాన్ని పెంచొద్దని హితవు

Exit mobile version