NTV Telugu Site icon

Skincare Mistakes: ఆ చిన్న తప్పు చర్మానికి ఎంత ముప్పో తెలుసా..

Skincare Mistakes

Skincare Mistakes

Skincare Mistakes: నేటి కాలంలో చాలా మంది అమ్మాయిలు తమ అందాన్ని కోల్పోతున్నామని చాలా బాధపడుతుంటారు. నలుగురిలో అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అందుకోసం కొన్ని ప్రయోగాలు చేస్తుంటారు. అందంగా కనిపించాలంటే అది చర్మంపై ఆధారపడి ఉంటుంది. కానీ మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చర్మం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. మరి మీరు చేసే చిన్న చిన్న తప్పులు ఏంటో తెలుసుకుందాం. చర్మ సంరక్షణ ఉత్పత్తులను వర్తించేటప్పుడు, అపరిశుభ్రమైన చేతులను ఉపయోగించడం వల్ల మీ చర్మం దెబ్బతింటుంది.

Read also: Big Breaking: హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై రచ్చ రచ్చ. బారిగేడ్లు తొలగించి నిమజ్జనాలు..

అంతేకాదు మన చేతులకు చాలా దుమ్ము ఉంటుంది. అవే చేతులను మళ్లీ ముఖానికి తాకడం వలన చర్మంపై మొటిమలు రావడం ఖాయం. అందుకే ముఖంపై చేతులు పెట్టే ముందుగా చేతులు బాగా శుభ్రం చేసుకోవాలి. అయితే చాలా మంది ముఖాన్ని వేడి నీటితో శుభ్రం చేస్తుంటారు. అలా చేయడం వలన చర్మం సహజంగా ఉత్పత్తి అయ్యే నూనెను పోగొట్టి, మీ చర్మం పొడిగా మరింత నష్టం కలగవచ్చు. కొంతమందికి ఈ వార్త తెలిసినా కూడా ముఖం కడుక్కోవడానికి వేడి నీటిని ఉపయోగిస్తుంటారు.

Read also: Cannabis in Ambles: అంబులెన్స్ లో గంజాయి తరలింపు.. బెడిసికొట్టిన ప్లాన్

వేడి నీటిని కాకుండా ముఖానికి గోరువెచ్చని నీటిని వాడితే మంచిది చర్మ సంరక్షణ నిపుణులు అంటున్నారు. ముఖానికి ఒకే క్లెన్సర్‌ను వాడటం వలన కూడా ముఖం ముడతలు వచ్చే ప్రమాదం ఉంది. కావున ఒకే క్లెన్సర్‌ను ఎక్కువ కాలం ఉపయోగించవద్దని, తరచూ మార్చుకోవాలని చర్మ సంరక్షణ నిపుణులు సూచిస్తున్నారు. ముఖాన్ని శుభ్రం చేయడానికి క్లెన్సర్‌ను చాలా కఠిన పద్దతిలో ఉపయోగించడం వల్ల మీ చర్మం మరింత దెబ్బతింటుంది.

Read also: Balapur Laddu: బాలాపూర్ గణేష్ లడ్డు కొన్నాక దశ తిరిగింది.. ఈసారి కూడా రికార్డు సృష్టిస్తా..!

అలాగే రోజులో రెండు సార్లు మాత్రమే ముఖం కడుక్కోవాలి. అయినప్పటికీ, చాలామంది అదేపనిగా తరచు, అనేక సార్లు ముఖాన్ని రోజుకు మూడు నాలుగు మార్లు శుభ్రం చేస్తారు. దీని వల్ల మీ చర్మం ద్వారా ఉత్పత్తి అయ్యే సహజమైన ఆయిల్‌ ను తొలగించి ముఖం పొడిగా మార్చుతుంది. దీని వల్ల త్వరగా ముఖం పాడవుతుంది. అప్పుడు అందంగా కనిపించడం ఏమో గానీ.. అంద విహీనంగా కనిపించడం ఖాయమంటున్నారు. అందుకే అందాన్ని కాపాడుకోవాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కానీ.. అతిగా జాగ్రత్తలు అవసరం లేదంటున్నారు.
Ganesh Immersion: అటు బాలాపూర్‌.. ఇటు ఖైరతాబాద్‌.. రూట్‌మ్యాప్‌ విడుదల చేసిన సీపీ ఆనంద్‌..