చలికాలంలో కండరాలు, కీళ్లలో ఒత్తిడి వల్ల నొప్పి రావడం సహజం. చలికాలంలో మోకాళ్ల నొప్పుల సమస్య సర్వసాధారణం. ఎందుకంటే శీతాకాలంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీని వల్ల మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. దీంతో నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. మోకాలి నొప్పికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్, ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, బోన్ క్యాన్సర్ రావచ్చు. ఇది కాకుండా.. మోకాళ్ల నొప్పులు గాయం లేదా విటమిన్ డీ లోపం వల్ల కూడా సంభవించవచ్చు. ఈ సమస్యలను ఎలా నయం చేయవచ్చో తెలుసుకుందాం..
READ MORE: Guntur: గుంటూరు టీడీపీలో వర్గ విభేదాలు.. ఎమ్మెల్యేను అడ్డుకున్న నేతలు
కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చని ఢిల్లీలోని ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ అఖిలేష్ కుమార్ తెలిపారు. చలికాలంలో మోకాళ్ల నొప్పులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుందని డాక్టర్ కుమార్ చెప్పారు. ఎందుకంటే చలిలో కండరాలు, కీళ్ళు ఒత్తిడికి గురవుతాయి. శారీరక శ్రమ తగ్గడం వల్ల మోకాళ్ల నొప్పులు పెరుగుతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల చలికాలంలో మోకాళ్ల నొప్పులు పెరుగుతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒక సాధారణ సమస్య. ఈ వ్యాధి ముఖ్యంగా వృద్ధులలో సాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో నడవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చలికాలంలో బలమైన గాలి కారణంగా మోకాలి నొప్పి తీవ్రమవుతుంది.
READ MORE: Chhattisgarh: 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఐదుగురికి మరణశిక్ష..
ఆర్థరైటిస్ రోగులు చలికాలంలో మోకాళ్ల నొప్పులను ఎక్కువగా ఎదుర్కొంటారు. రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల మోకాలిలో నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పితో బాధపడేవారు చలి రోజుల్లో బయటకు వెళ్లినప్పుడల్లా శరీరాన్ని ఉన్ని దుస్తులతో కప్పి ఉంచడం మంచిది. మోకాళ్లకు రక్షణగా మార్కెట్ లో లభించే థర్మల్ దుస్తులను ధరించాలి. మోకాళ్ల రోగులు ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకూడదు. దీంతో మోకాళ్ల నొప్పులు మరింతగా పెరుగుతాయి. నెమ్మదిగా నడుస్తూ ఉండాలి. రోగి కొన్ని సాధారణ వ్యాయామం కూడా చేయాలి. తద్వారా కండరాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి.
READ MORE: A-THON Ashva: వ్యవసాయం కోసం ప్రత్యేక కారు.. పొలాలైనా, పర్వతాలైనా ఇట్టె ఎక్కేస్తుంది! ధర ఎంతంటే?