NTV Telugu Site icon

Tea Cups: బాబోయ్‌ పేపర్‌ కప్పులు..

Tea Cups

Tea Cups

Tea Cups: ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలనే ఉద్దేశంతో టీ స్టాళ్లలో ప్లాస్టిక్ గ్లాసుల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. అదే సమయంలో ప్లాస్టిక్‌కు బదులు పేపర్ గ్లాసులను వాడుతున్నారు. టీ స్టాళ్లు ఇచ్చే గ్లాసులతో చాలా ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది. పేపర్ గ్లాసులకు బదులు దర్మాకోల్‌తో తయారు చేసిన గ్లాసులను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించే క్రమంలో టీ స్టాళ్లలో ప్లాస్టిక్ గ్లాసుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. అదే సమయంలో ప్లాస్టిక్‌కు బదులు పేపర్ గ్లాసులను వాడుతున్నారు.

Read also: Pakistan: ప్రభుత్వం-న్యాయ వ్యవస్థ వివాదం.. చీఫ్ జస్టిస్ అధికారాల కోతపై బిల్లు.. తిప్పిపంపిన అధ్యక్షుడు..

టీ స్టాళ్లు ఇచ్చే గ్లాసులు ప్రాణాలకు ప్రమాదకరమని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. పేపర్ గ్లాసులకు బదులు దర్మాకోల్‌తో తయారు చేసిన గ్లాసులను వాడుతున్నట్లు గుర్తించారు. చాలా పెద్ద మొత్తంలో ఈ వ్యవహారం బయటకు రావడంతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ధర్మాకోల్ మెటీరియల్ తో కప్పులు తయారు చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెబుతున్నారు. కాగితాల్లో వేడి వేడి కాఫీ, టీ తాగితే ప్రమాదం లేదు. అయితే ధర్మాకోల్‌తో చేసిన కప్పులను తాగితే ప్రాణానికే ప్రమాదం. తమకు తెలియకుండానే చాలా మంది సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారని, మరికొందరు ఉద్దేశపూర్వకంగా ధర్మాకోల్‌తో కప్పులు తయారు చేసి సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

Read also: Diet risk: అతిగా ఆశ పడకండి.. ప్లీజ్ తినడం మానేయకండి

ప్రభుత్వం వీటిని నిషేధించినా.. కొందరు వీటిని వాడుతున్నారు. తాము ప్లాస్టిక్‌ను వాడడం లేదంటూ అంతమించిన ప్రమాదకరమైన క్యాన్సర్‌కు కారణమయ్యే ధర్మాకోల్‌ను వాడుతూ ఎదుటి వారినే కాదు.. వారు కూడా ప్రమాదంలో వున్నారని వారికే తెలియని అయోమయంలో వున్నారు. అందుకే టీ స్టాల్‌ కి వెళ్లినప్పుడు వేడి నీళ్లలో కడిన గాజు కప్పులో అయినా సరే టీ, కాఫీలు తాగండి కానీ ఇలా పేపర్‌ కప్పుల్లో మాత్రం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments