NTV Telugu Site icon

MPOX: అలర్ట్..భారత్ లోకి మంకీపాక్స్ ఎంట్రీ! విదేశాల నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి వైరస్ లక్షణాలు!

Mpox

Mpox

దేశంలో మంకీపాక్స్ అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది. రోగిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చింతించాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. అనుమానాస్పద మంకీపాక్స్ కేసులో పరీక్షలు జరుగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఓ యువకుడికి ఇలాంటి లక్షణాలు కనిపించాయి. అతడు ఇటీవల మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ ఉన్న దేశంలో ప్రయాణించినట్లు కనుగొన్నారు. ఇటీవల మన దేశానికి తిరిగి వచ్చాడు. అతని శరీరంపై మంకీపాక్స్ కు సంబంధించిన లక్షణాలు కనిపించాయి. రోగిని నియమించబడిన ఆసుపత్రిలో ఐసోలేట్ చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించి, ఆరోగ్య సేవలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో అన్ని సంబంధిత శాఖలు మరియు ఏజెన్సీలు అప్రమత్తంగా ఉన్నాయి. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి.

READ MORE: Vizag: విశాఖలో కుండపోత వర్షం.. ప్రమాదకర స్థితిలో ఇళ్లు

ఆరోగ్య మంత్రిత్వ శాఖ
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి) ఈ విషయాన్ని పరిశీలిస్తున్నందున ఈ విషయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలాంటి ప్రయాణ సంబంధిత విషయాలను ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా తెలియజేసింది. అలాగే, అటువంటి కేసులను గుర్తించడానికి ట్రేసింగ్ ఛానల్ ఏర్పాటు చేయబడింది.

READ MORE: Rains Effect: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో రేపు విద్యా సంస్థలకు సెలవు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోంది?

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న వందలాది మంకీపాక్స్​ కేసులు మరో మహమ్మారికి దారి తీసే అవకాశంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఈ వ్యాధి గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పింది. మంకీపాక్స్​ ఎలా వ్యాప్తి చెందుతుందనే విషయం సహా దశాబ్దాల కిందే మశూచి టీకాల కార్యక్రమాన్ని నిలిపివేయడం వల్ల ఇది వేగంగా సంక్రమించడానికి వీలవుతుందా అనేది తెలియాల్సి ఉందని పేర్కొంది. ప్రపంచదేశాల్లో వెలుగుచూస్తున్న మంకీపాక్స్​ కేసుల్లో అధిక శాతం స్వలింగ, ద్విలింగ సంపర్కులు, పురుషులతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్న పురుషుల్లోనే అనేది నొక్కి చెప్పడం ముఖ్యమని డబ్ల్యూహెచ్​ఓ డా.రోజమండ్​ లూయిస్ సోమవారం ఓ సభలో అన్నారు. అప్పుడే దీనిపై శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేయగలరగని, రిస్క్​ ఎక్కువగా ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోగలరని చెప్పారు. అయితే లైంగిక ధోరణితో సంబంధంలేకుండా ఎవరికైనా వ్యాధి సోకే ప్రమాదముందని హెచ్చరించారు.