NTV Telugu Site icon

Diabetes: షుగర్ వ్యాధికి కోవిడ్‌తో లింక్.. తాజా అధ్యయనంలో వెల్లడి.

Covid 19, Diabetes

Covid 19, Diabetes

Diabetes: కోవిడ్ ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నాయి. అయినా కూడా ప్రపంచంలో ఇంకా దాని ప్రభావం పూర్తిగా తగ్గలేదు. ప్రపంచంలో ఎక్కడో చోట కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. శ్వాససంబంధ ఇబ్బందులను ఎదుర్కుంటూనే ఉన్నారు. తాజాగా ఓ అధ్యయనం డయాబెటిస్ వ్యాధి కోవిడ్ తో ముడిపడి ఉన్నట్లు కనుగొంది.

Read Also: Terrorists Attack : ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి.. ఐదుగురు జవాన్ల మృతి

బ్రిటిష్ కొలంబియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మరియు వాంకోవర్‌లోని సెయింట్ పాల్స్ హాస్పిటల్‌లోని పరిశోధకులు SARS-Cov-2 ఇన్‌ఫెక్షన్‌కి కొత్త డయాబెటిస్ కేసుల అనుబంధాన్ని గుర్తించడానికి ఒక ప్రధాన అధ్యయనాన్ని నిర్వహించారు. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా అధ్యయనం వల్ల ఇది నిజమే అని తెలుస్తోంది. కొత్తగా నమోదు అవుతున్న ప్రతీ 20 డయాబెటిస్ కేసుల్లో ఒకటి కోవిడ్ తో సంబంధం ఉన్నట్లు తేలింది.

6,29,935 మంది వ్యక్తులపై పరిశోధన చేసి, కోవిడ్ ఇన్ఫెక్షన్, టీకాల డేటాను అనుసరించి ఫలితాలను విశ్లేషించారు. కోవిడ్-19తో బాధపడుతున్న వ్యక్తులు టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. కొత్తగా వస్తున్న కేసుల్లో 3-5 శాతం షుగర్ కేసులకు కోవిడ్-19 కారణం అని అధ్యయనం వెల్లడించింది. SRS-CoV-2 వైరస్ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతున్నప్పటికీ, ఇతర అవయవ వ్యవస్థలు కూడా ప్రభావితం కావచ్చని, ఇది వివిధ తీవ్రమైన, దీర్ఘకాలిక పరిణామాలకు దారితీస్తుందని పరిశోధకులు చాలా కాలంగా సూచిస్తున్నారు.