NTV Telugu Site icon

Health: ముప్పై ఏళ్లలో 18 శాతం పెరిగిన ఈ ప్రాణాంతక సమస్య కేసులు..

Stroke

Stroke

ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు మరణానికి ప్రధాన కారణమవుతున్నాయి. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యువకులలో స్ట్రోక్ కూడా పెరుగుతోందని పరిశోధకులు కనుగొన్నారు. స్ట్రోక్‌ని బ్రెయిన్ స్ట్రోక్ అని కూడా అంటారు. మెదడులోని కొంత భాగానికి రక్త సరఫరా లేనప్పుడు లేదా మెదడులోని రక్త నాళాలు కొన్ని కారణాల వల్ల పగిలినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. అధ్యయనాల విశ్లేషణ ప్రకారం.. గత 30 ఏళ్లలో స్ట్రోక్ వంటి నరాల సంబంధిత పరిస్థితులతో బాధపడుతున్న లేదా మరణించిన వారి సంఖ్య 18 శాతం పెరిగింది. స్ట్రోక్ ప్రమాదాలు, నివారణ మరియు చికిత్స గురించి అవగాహన పెంచడానికి.. ప్రాణాలతో బయటపడిన వారికి మెరుగైన సంరక్షణ అందించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న ప్రపంచ స్ట్రోక్ డేని జరుపుకుంటారు. స్ట్రోక్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని ప్రమాదాల పట్ల చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ జాగ్రత్త వహించాలని చెబుతున్నారు.

AP Weather: ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు.. రాయలసీమ, దక్షిణ కోస్తాకు హైఅలర్ట్

స్ట్రోక్‌ ప్రధానంగా రెండు రకాలు..
ఇస్కీమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్.. ఇది జీవనశైలి, ఆహారపు ఆటంకాల వల్ల స్ట్రోక్‌కు దారి తీస్తాయి. అంతేకాకుండా.. అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, హైపర్ కొలెస్టెరోలేమియా వంటి పరిస్థితులు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ధూమపానం వల్ల యువత ఎక్కువగా స్ట్రోక్ బారిన పడుతున్నారని తేలింది. 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఎక్కువగా (రోజుకు 20 సిగరెట్లకు పైగా) ధూమపానం చేసేవారు స్ట్రోక్ ప్రమాదాన్ని రెట్టింపు కంటే ఎక్కువ కలిగి ఉంటారని పరిశోధకుల బృందం కనుగొంది. ధూమపానం అలవాటు యువకులలో మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే పెద్ద నాళాలను దెబ్బతీస్తుందని తేలింది. ఇది అధిక రక్తపోటుకు కూడా దారితీస్తుంది. దీంతో.. స్ట్రోక్‌తో పాటు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

Balayya Boyapati 4: బాలయ్య ఫాన్స్ ఊపిరి పీల్చుకోండి !

స్ట్రోక్ అనేది ప్రాణాంతక పరిస్థితి.. స్ట్రోక్ వచ్చిన తర్వాత బతికున్న వ్యక్తుల్లో పక్షవాతం, ఇతర తీవ్రమైన ఆరోగ్య రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దాని ప్రమాద కారకాలను తెలుసుకోవడం.. దానిని నివారించడం చాలా ముఖ్యం. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, ఊబకాయం, మధుమేహం ఈ ఐదు స్ట్రోక్‌కు ప్రధాన కారణాలు. యువత ఆరోగ్యం పట్ల తీవ్రమైన శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. జీవనశైలి, ఆహారాన్ని మెరుగుపరచడం ద్వారా ఈ ప్రమాద కారకాలన్నింటినీ నివారించవచ్చు.

Show comments