NTV Telugu Site icon

Health Tips : రాత్రి పూట లైట్ వేసుకుని నిద్రిస్తే చాలా ప్రమాదం: ఆండ్రూ ఫిలిప్స్

Sleep

Sleep

ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు చెబుతుంటారు. మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలం. వేరే పనుల ధ్యాసలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవు. అయితే మన ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపించే అంశం నిద్ర. కానీ మనం ఎలా నిద్ర పోతున్నామన్నది ముఖ్యం. రాత్రిపూట లైట్లు ఆర్పి నిద్రించడం సహజంగా చేసే పని. అయితే కొందరు లైట్లను ఆర్పకుండానే నిద్రపోతుంటారు. అయితే ఇది మంచిది కాదని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. రాత్రిపూట లైట్ వెలుతురులో నిద్రించే వారికి టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని ఎక్కువగా ఉంటుందట.

READ MORE: Bengaluru traffic: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై రెడ్‌సిగ్నల్ దాటినా నో ప్రోబ్లం!

ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం, ది లాన్సెట్ రీజినల్ హెల్త్-యూరోప్ జర్నల్‌లో ప్రచురించబడింది. అధ్యయనం ప్రధాన రచయిత, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఆండ్రూ ఫిలిప్స్ ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ.. “రాత్రిపూట ప్రకాశవంతమైన కాంతికి గురికావడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. రాత్రిపూట కాంతికి గురికావడం వల్ల మన సిర్కాడియన్ రిథమ్‌కు అంతరాయం కలుగుతుంది. దీంతో ఇన్సులిన్, గ్లూకోజ్ మెటబాలిజంలో మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది చివరికి టైప్ 2 మధుమేహానికి దారి తీస్తుంది.” అని పేర్కొన్నారు.

READ MORE: CM Chandrababu: జీపీఎస్ గెజిట్ ఎలా విడుదలైందని సీఎం చంద్రబాబు ఆరా..

అధ్యయనం ఎలా చేశారు?
ఈ అధ్యయనాన్ని సుమారు 85 వేల మందిపై చేశారు. టైప్ 2 డయాబెటిస్ లేని 85 వేల మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వీరిని అర్ధరాత్రి 12:30 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లైట్ కాంతికి గురయ్యేలా చేశారు. దాదాపు 13 మిలియన్ గంటల లైట్ సెన్సార్ డేటా నుంచి సమాచారాన్ని విశ్లేషించారు. అధ్యయనం ప్రారంభించినప్పుడు ఈ పాల్గొనేవారికి టైప్ 2 డయాబెటిస్ లేదు. తొమ్మిదేళ్లుగా కొనసాగిన ఈ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది.