NTV Telugu Site icon

Pragathi : వామ్మో..చీరలో ప్రగతి జిమ్ వీడియో చూశారా?

Pragathi

Pragathi

సినీనటి ప్రగతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రల్లో నటించి జనాలను ఆకట్టుకుంది.. తలి, అత్త పాత్రలలో ఎక్కువగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది..45 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్న ప్రగతికి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అటు సోషల్ మీడియాలో కూడా నటి ప్రగతి చాలా చురుకుగా ఉంటుంది. ముఖ్యంగా జిమ్ లలో ఎక్కువ బరువులు మోస్తూ రకరకాల వర్కౌట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో కూడా పాల్గొంటూ ఉంటది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రాజంలో జరిగిన మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొని బహుమతి కూడా ప్రగతి గెలుచుకోవడం జరిగింది.

ఇంత వయస్సు లో కూడా ఫుల్ ఆరోగ్యంగా, బాడీని కూడా ఫిట్ గా మెయింటైన్ చేస్తున్నారు ప్రగతి.. ఆమె చేసే వర్కౌట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.. ఈ వయస్సులో కూడా అస్సలు తగ్గట్లేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె తన గురించి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. ముఖ్యంగా జిమ్ వీడియోలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. ఎప్పటికప్పుడు ఫిట్ గా ఉండటానికి ట్రై చేస్తుంది.. ఈ ఏజ్ లో కూడా జిమ్ లో అంత కష్టపడుతున్నారంటే గ్రేట్ అని పలువురు కామెంట్స్ చేస్తూ ప్రగతిని అభినందిస్తారు.

ఎప్పుడు వీడియోను పోస్ట్ చేసినా కూడా జిమ్ డ్రెస్ లో వీడియోలు పోస్ట్ చేస్తుండగా తాజాగా చీరలో జిమ్ వీడియో పోస్ట్ చేయడం విశేషం.. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.. ఇకపోతే ఈ వీడియో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. 90 కేజీల బరువు మోయడం, అది కూడా చీరలో ఇలా మోయడం నిజంగా గ్రేట్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల ప్రగతి రెండో పెళ్లి గురించి రూమర్స్ రాగా వాటిని సీరియస్ గా ఖండించింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది..

Show comments