Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం
- అటుకులతో కొత్తగా బిసిబేళా బాత్ ట్రై చేశారా?
- తక్కువ టైంలో రెడీ అయ్యే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్
- బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్
- అటుకుల రుచితో సాంప్రదాయ బిసిబేళా బాత్‌కు ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poha Bisibele Bath Recipe : సాధారణంగా మనం బియ్యంతో చేసే బిసిబేళా బాత్ గురించి వినే ఉంటాం. కానీ, ఎప్పుడైనా అటుకులతో (Poha) ట్రై చేశారా? అటుకుల బిసిబేళా బాత్ కేవలం రుచికరమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తక్కువ సమయంలో, తక్కువ క్యాలరీలతో బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్ బాక్స్‌లోకి ఏదైనా వెరైటీగా చేయాలనుకుంటే ఇది ఒక ఉత్తమ ఎంపిక. దీని తయారీ విధానం, కావలసిన పదార్థాల వివరాలు ఇవే..
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
కావలసిన పదార్థాలు:
- గట్టి అటుకులు (Thick Poha) – 1 కప్పు
- కందిపప్పు – అర కప్పు
- బిసిబేళా బాత్ పౌడర్ – 2 నుండి 3 చెంచాలు
- కూరగాయ ముక్కలు (క్యారెట్, బీన్స్, బఠానీలు, ఆలుగడ్డ) – 1 కప్పు
- చింతపండు రసం – కొద్దిగా
- బెల్లం తురుము – కొద్దిగా (రుచికి తగినట్లు)
- ఉప్పు – తగినంత
- పోపు కోసం: నెయ్యి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, జీడిపప్పు.
తయారీ విధానం:
మొదటగా కందిపప్పు , తరిగిన కూరగాయ ముక్కలను కుక్కర్‌లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. మరోవైపు అటుకులను శుభ్రంగా కడిగి, ఐదు నిమిషాల పాటు నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో ఉడికించిన పప్పు, కూరగాయల మిశ్రమాన్ని వేసి, దానికి తగినన్ని నీళ్లు, చింతపండు రసం, ఉప్పు, బెల్లం కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం మరుగుతున్నప్పుడు బిసిబేళా బాత్ పౌడర్‌ను కొద్దిగా నీటిలో కలిపి (ఉండలు కట్టకుండా) అందులో వేయాలి.
Dhurandhar The Revenge : అక్కడ ఒక్కచోట 13 రోజుల్లో రూ. 360 కోట్లు వసూలు చేసిన ధురంధర్
చివరగా నానబెట్టుకున్న అటుకులను ఈ మిశ్రమంలో వేసి, అంతా కలిసేలా కలుపుతూ చిన్న మంటపై ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. అటుకులు మిశ్రమాన్ని పీల్చుకుని దగ్గరపడిన తర్వాత, నెయ్యిలో వేయించిన ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు , కరివేపాకుతో పోపు పెట్టుకుని పైన వేయాలి. అంతే.. వేడివేడి ‘అటుకుల బిసిబేళా బాత్’ సిద్ధం! దీన్ని ఖారబూందీ లేదా చిప్స్‌తో సర్వ్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.
బియ్యం వాడకం తగ్గించాలనుకునే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఈ అటుకుల బిసిబేళా బాత్ ఒక గొప్ప ప్రత్యామ్నాయం. త్వరగా అయిపోయే ఈ వంటకాన్ని మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!