Shocking : మైక్రోప్లాస్టిక్స్ మెదడులో పేరుకుపోతున్నాయా..? కొత్త అధ్యయనంలో షాకింగ్ నిజాలు..!
- రోజురోజుకి పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం
- పర్యావరణానికే కాకుండా మన ఆరోగ్యానికీ తీవ్ర ముప్పు
- ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ తగ్గని ప్లాస్టిక్ వినియోగం
- మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి ప్రవేశించి మెదడులో పేరుకుపోతున్నాయని హెచ్చరించిన శాస్త్రవేత్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking : రోజురోజుకి ప్లాస్టిక్ వినియోగం పెరుగుతూ పర్యావరణానికే కాకుండా మన ఆరోగ్యానికీ తీవ్ర ముప్పు కలిగిస్తోంది. ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్లాస్టిక్ వినియోగం తగ్గడం లేదు. తాజా అధ్యయనం ప్రకారం, మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి ప్రవేశించి మెదడులో పేరుకుపోతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి 2000 నుంచి రెట్టింపు కాగా, 2060 నాటికి ఇది మూడింతలు పెరిగే అవకాశం ఉందని అంచనా. న్యూమెక్సికోలో 2016 మరియు 2024లో మరణించిన వ్యక్తుల మెదడు కణజాలాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు, కాలక్రమేణా మైక్రోప్లాస్టిక్స్ స్థాయి పెరిగిందని గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు. మైక్రోప్లాస్టిక్స్ ప్రభావంపై స్పష్టమైన ఫలితాలు లేకపోయినా, న్యూరోలాజికల్ సమస్యలు, మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గుదల వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి రక్త-మెదడు అవరోధాన్ని దెబ్బతీసి, ఇన్‌ఫ్లమేషన్ పెంచి అవయవాలను నాశనం చేసే ప్రమాదమూ ఉందని చెబుతున్నారు.
Off The Record: పార్టీ ఏదైనాసరే.. ఆ బ్రదర్స్‌కు కేసులు కామనా..?
Also Read
- Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్‌లో కాలా చనా పులావ్.. టేస్ట్‌తో పాటు ప్రోటీన్ డబుల్.!
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Bed Bugs: మీ పరుపుల్లో నల్లులు నిద్ర పోతున్నాయా? పైసా ఖర్చు లేకుండా నల్లులకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టండి!
- Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
తగ్గించుకోవాల్సిన జాగ్రత్తలు
- ప్లాస్టిక్ బాటిళ్లను వాడటం, రీయూజ్ చేయడం మానేయాలి.
- వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో ఉంచకూడదు. గ్లాస్ లేదా సిరామిక్ పాత్రలు ఉపయోగించడం మంచిది.
- ఫుడ్ కటింగ్ కోసం ప్లాస్టిక్ బోర్డుల బదులు చెక్క బోర్డులు వాడాలి.
- పిల్లలకు పాలు, ఫార్ములా కోసం సిలికాన్ బాటిళ్లు వాడాలి.
ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం మన ఆరోగ్య రక్షణకు మొదటి అడుగు. ఆహారం నుంచి నీటి బాటిల్ వరకు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మైక్రోప్లాస్టిక్స్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
War 2: హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య “వార్”.. ఇది ముగింపు కాదంటూ తారక్ ట్వీట్..!
తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్‌షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!