Site icon NTV Telugu

Shocking : మైక్రోప్లాస్టిక్స్ మెదడులో పేరుకుపోతున్నాయా..? కొత్త అధ్యయనంలో షాకింగ్ నిజాలు..!

Micro Pralstic In Brain

Micro Pralstic In Brain

Shocking : రోజురోజుకి ప్లాస్టిక్ వినియోగం పెరుగుతూ పర్యావరణానికే కాకుండా మన ఆరోగ్యానికీ తీవ్ర ముప్పు కలిగిస్తోంది. ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్లాస్టిక్ వినియోగం తగ్గడం లేదు. తాజా అధ్యయనం ప్రకారం, మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి ప్రవేశించి మెదడులో పేరుకుపోతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి 2000 నుంచి రెట్టింపు కాగా, 2060 నాటికి ఇది మూడింతలు పెరిగే అవకాశం ఉందని అంచనా. న్యూమెక్సికోలో 2016 మరియు 2024లో మరణించిన వ్యక్తుల మెదడు కణజాలాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు, కాలక్రమేణా మైక్రోప్లాస్టిక్స్ స్థాయి పెరిగిందని గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు. మైక్రోప్లాస్టిక్స్ ప్రభావంపై స్పష్టమైన ఫలితాలు లేకపోయినా, న్యూరోలాజికల్ సమస్యలు, మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గుదల వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి రక్త-మెదడు అవరోధాన్ని దెబ్బతీసి, ఇన్‌ఫ్లమేషన్ పెంచి అవయవాలను నాశనం చేసే ప్రమాదమూ ఉందని చెబుతున్నారు.

Off The Record: పార్టీ ఏదైనాసరే.. ఆ బ్రదర్స్‌కు కేసులు కామనా..?

తగ్గించుకోవాల్సిన జాగ్రత్తలు

ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం మన ఆరోగ్య రక్షణకు మొదటి అడుగు. ఆహారం నుంచి నీటి బాటిల్ వరకు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మైక్రోప్లాస్టిక్స్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

War 2: హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య “వార్”.. ఇది ముగింపు కాదంటూ తారక్ ట్వీట్..!

Exit mobile version