NTV Telugu Site icon

Flesh Eating Bacteria: దోమల్లో మాంసాన్ని తినే బ్యాక్టీరియా..పలు దేశాల్లో గుర్తింపు

Buruli Ulcer

Buruli Ulcer

Meat Eating Bacteria: దోమల ద్వారానే చాలా వ్యాధులు మనుషులకు వ్యాపిస్తుంటాయి. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, పైలేరియా, జికా వంటి ప్రమాదకరమైన వ్యాధుల వ్యాప్తికి దోమలే వాహకాలుగా పనిచేస్తుంటాయి. దోమలు మానవుడిని కుట్టిన సమయంలో ఈ బ్యాక్టీరియా, వైరస్ లు మానవ శరీరంలోకి చేరి జబ్బుల్ని కలిగిస్తుంటాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు అంతకన్నా ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో మానవాళికి ప్రమాదం పొంచి ఉంది. ఈ కొత్త బ్యాక్టీరియా చాలా ప్రమాదమని ఆస్ట్రేలియా పరిశోధకులు హెచ్చరించారు.

Read Also: Janhvi Kapoor Tamil Debut: జాన్వీ కపూర్‌కి గోల్డెన్‌ చాన్స్‌.. కోలీవుడ్‌ యువ హీరోతో సినిమా! నిర్మాత కమల్

‘మాంసం తినే బ్యాక్టీరియా’తో ప్రమాదం నెలకొంది. కొన్ని దోమల్లో ఉండే మైకోబ్యాక్టీరియం అల్సెరాన్ బ్యాక్టీరియా జీవులు బతికి ఉండగానే మాంసం కుళ్లిపోయే పరిస్థితిని తీసుకొస్తున్నాయి. ఈ బ్యాక్టీరియా వల్లల బురూలీ అల్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక వేళ ఈ జబ్బు మనుషులకు సోకితే చర్మం, ఎముకలు దెబ్బతింటాయి. సాధారణంగా ఈ బ్యాక్టీరియా దోమల్లో ఎక్కువగా ఉండదు. కానీ ఇటీవల ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల్లో ఇది దోమల్లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. త్వరలో ఇది మనుషులకు సోకే అవకాశం ఉందని హెచ్చరించారు. బ్యాక్టీరియా వచ్చిన వారిలో శాశ్వత వైకల్యం వచ్చే అవకాశం ఉంటుంది.

Show comments