Site icon NTV Telugu

Night Shifts: కేవలం 3 నైట్ షిఫ్టులు చాలు షుగర్, ఊబకాయం రావడానికి.. అధ్యయనంలో వెల్లడి..

Night Shifts

Night Shifts

Night Shifts: పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వంటివి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలాయి. ప్రసుతం ఉన్న బిజీ లైఫ్‌లో వృద్ధాప్యంలో రావాల్సిన వ్యాధులు యుక్త వయసులోనే వస్తున్నాయి. తాజాగా నైట్ షిఫ్టులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఒక అధ్యయనం కనుగొంది. మధుమేహం, ఊబకాయం ఇతర జీవక్రియ రుగ్మతల వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచడానికి కేవలం మూడు నైట్ షిఫ్టులు సరిపోతాయని స్టడీ తెలిపింది.

అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు రాత్రి షిఫ్టుల వల్ల రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు సంబంధించి ప్రోటీన్ రిథమ్స్ దెబ్బతింటాయని వెల్లడించింది. ఇది ఎనర్జీ జీవక్రియను అడ్డుకోవడమే కాకుండా దీర్ఘకాలిక జీవక్రియ పరిస్థితులను ప్రభావితం చేస్తుందని వెల్లడించింది. ప్రొటీన్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో పరిశోధన బృందం .. ‘‘మెదడులోని మాస్టర్ బయోలాజికల్ క్లాక్’’ గురించి కూడా వివరించింది. ఇది పగలు, రాత్రి శరీర లయలను అనుసరించేలా చేస్తుంది. అయితే, క్రమరహితంగా ఉన్నప్పుడు దీర్ఘకాలిక ఆరోగ్య పరిణామాలకు కారణమయ్యే ఒత్తిడికి దారి తీస్తుందని ప్రొఫెసర్ హన్స్ వాన్ డాంగెన్ చెప్పారు.

Read Also: Pallavi Prasanth : అమ్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రైతు బిడ్డ.. ధర ఎంతో తెలుసా?

కేవలం మూడు నైట్ షిఫ్ట్‌లు శరీర లయకి అంతరాయం కలిగించడాని, ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడానికి సరిపోతాయని చెప్పారు. ఇది మధుమేహం, ఊబకాయాన్ని రిస్క్‌ని పెంచుతుందని, దీనిని నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. రక్తనమూనాలను ఉపయోగించి పరిశోధన బృందం రక్తం-ఆధారిత రోగనిరోధక వ్యవస్థ కణాలలో ఉన్న ప్రొటీన్‌లను గుర్తించింది. వీటిలో కొన్ని లయలు మాస్టర్ బయోలాజికల్ క్లాక్‌తో ముడిపడి ఉన్నట్లు గుర్తించారు. రాత్రి పూట పనిచేయడం వల్ల చాలా వరకు ప్రోటీన్లు మార్పును చూపించాయి. గ్లూకోజ్ నియంత్రణలో పాల్గొంటున్న ప్రొటీన్లను విశ్లేషించడం ద్వారా నైట్ షిఫ్ట్‌లో పాల్గొనే వారిలో గ్లూకోజ్ లయలు దాదాపుగా పూర్తిగా మారడాన్ని కనుగొంది. నైట్ షిఫ్ట్ వర్కర్లలో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా ప్రభావితమైనట్లు కనుగొన్నారు. దీనికి అదనంగా గతంలో కొన్ని అధ్యయనాలు నైట్ షిఫ్టులు రక్తపోటు(బీపీ)పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని రుజువు చేశాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్‌ని పెంచుతోంది.

Exit mobile version