NTV Telugu Site icon

PCOD-PCOS: పీసీఓడీ-పీసీఓఎస్ తేడా ఇదేనా? ఇలా చేయండి

Untitled 11

Untitled 11

health: మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన శైలి కూడా మారుతూ వస్తుంది. ఈ మార్పు కొన్ని ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంది. ప్రస్తుతం 12 సంవత్సరాలు పైబడిన పిల్లల నుండి 50 సంవత్సరాల మహిళల వరకు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య పీసీఓడీ/పీసీఓఎస్.. అయితే ఈ పీసీఓడీ/పీసీఓఎస్ రెండు ఒకటేనా..? అంటే కాదు. వీటి లక్షణాలు చూడడానికి దాదాపు ఒకేలా ఉన్న రెండింటికి చాల తేడా ఉంది. మరి ఆ తేడా ఏంటి..? నివారణ ఉందా? ఎం చేస్తే ఈ సమస్య నుండి ఉపసమనం లభిస్తుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read also:Air Ambulance: తెలంగాణలో ఎయిర్ అంబులెన్స్‌లు.. ఆపద సమయంలో అత్యవసర సేవలు..

PCOD అనేది ఒక సాధారణ రుగ్మత (డిసార్డర్) అంటే స్త్రీలలో పునరుత్పత్తి హార్మోన్లు అయినటువంటి ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరోన్ హార్మోన్ల అసమతుల్యత కారణంగా అండాశయాలు అధిక సంఖ్యలో అపరిపక్వ లేదా పాక్షికంగా పరిపక్వమైన అండాలను( ఎగ్స్) ఉత్పత్తి చేస్తాయి. ఊబకాయం, ఒత్తిడి అలానే తినే ఆహరం, జీవనశైలి కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అయితే PCOS అనేది మెటబాలిక్ డిజార్డర్. PCOD తీవ్రత ఎక్కువైనప్పుడు అది PCOS గా మారే అవకాశం ఉంది. ఇందులో అండం విడుదల కాదు. PCOD సమస్య ఉండేవాళ్ళు చికిత్స తీసుకుంటే గర్భం దాల్చగలరు. కానీ PCOS లో గర్బం దాలచడం కష్టం. PCOD తీవ్రమైన సమస్యలకు దారితీయద్దు. కానీ PCOS టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు మరియు ఎండోమెట్రియల్ క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.

Read also:Tiger Nageswara Rao: రవితేజ నయా మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కు పూనకాలే..

అయితే PCOD, PCOS రెండింటికి కూడా శాశ్వత నివారణ చికిత్స లేదు. మన జీవన శైలిని మార్చుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. మరి ఈ సమస్య తో బాధపడేవారు తినాల్సిన ఆహారం గురించి చెయ్యాల్సిన పనులు గురించి ఇప్పుడు చూదాం.. ప్రతినిత్యం క్రమం తప్పకుండ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చెయ్యాలి. అధిక బరువుని తగ్గించుకోవాలి. కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్న ఆహారం అంటే బంగాళదుంపలు, బ్రెడ్, బియ్యం, పాస్తా మరియు బీన్స్ వంటివి తినకపోవడమే మంచిది. చేపలు, మాంసం, గుడ్లు, నేల పైన పెరిగే కూరగాయలు మరియు సహజ కొవ్వులు (పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, నువ్వులు మరియు వెన్న వంటివి) రోజువారి ఆహరంలో ఉండేలా చూసుకోవాలి.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.