NTV Telugu Site icon

వ్యాధినిరోధ‌కశ‌క్తిని పెంచుకోవ‌డానికి భార‌తీయులు ఏడాదిలో ఎంత ఖ‌ర్చు చేశారో తెలుసా?

క‌రోనా కాలంలో ప్ర‌జ‌లు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డంపై దృష్టి సారించారు.  క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాని స‌మ‌యంలో నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డానికి వివిధ మార్గాల‌ను అన్వేషించారు.  విట‌మిన్లు, స‌ప్లిమెంట్లు, డైట్‌, వ్యాయామం వంటివాటి ద్వారా వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డంపై దృష్టిసారించిన‌ట్టు ఆల్ ఇండియా ఆర్గ‌నైజేష‌న్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్ర‌గ్గిస్ట్ నివేదిక‌లో పేర్కొన్న‌ది.  

Read: “హీరో”కు భారీ రెస్పాన్స్… టీం సెలెబ్రేషన్స్

ఈ నివేదిక ప్ర‌కారం, ఇమ్యూనిటీ బూస్ట‌ర్ల‌కోసం ఏకంగా భార‌తీయులు రూ.15 వేల కోట్ల రూపాయలను ఖ‌ర్చుచేసిన‌ట్లుగా పేర్కొన్న‌ది.  ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాద‌ని క‌రోనా అందరికీ తెలియ‌జేయ‌డంతో, వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డంపైనే దృష్టిసారించారు.  2019 వ సంవ‌త్స‌రంలో ఇమ్యూనిటీ బూస్ట‌ర్ల కోసం రూ.5 వేల కొట్లు ఖ‌ర్చుచేయ‌గా దానికి మూడింత‌లు 2020 లో ఖ‌ర్చుచేశారు.