Site icon NTV Telugu

COVID-19: మీకు కరోనా లక్షణాలు కనిపిస్తే.. ఎక్కడ పరీక్ష చేయించుకోవాలి?

Covid 19

Covid 19

భారత్‌లో యాక్టివ్ కోవిడ్ రోగుల సంఖ్య వేయికి పైగా పెరిగింది. ఈ వైరస్ కేసులు ఢిల్లీ నుంచి దక్షిణ భారతదేశం అన్ని రాష్ట్రాలకు వ్యాప్తి చెందుతోంది. కోవిడ్ రోగులలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, వాసన లేదా రుచి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మీకు కూడా అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. సకాలంలో కోవిడ్-19 పరీక్ష చేయించుకోవడం ద్వారా, వైరస్‌ను సులభంగా గుర్తించవచ్చు. లక్షణాలు తీవ్రం కాకుండా నిరోధించవచ్చు.

READ MORE: Vijay Mallya Tweet On RCB: ఆర్‌సీబీని ప్రశంసిస్తూ విజయ్‌ మాల్యా ట్వీట్‌.. నెటిజన్స్ ట్రోలింగ్

వాస్తవానికి.. దేశంలోని దాదాపు ప్రతి జిల్లా ఆసుపత్రి, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో వెళ్లి కోవిడ్ పరీక్ష చేయించుకోవచ్చని చెప్పారు. ఈ సౌకర్యం సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితం. మీరు CoWIN పోర్టల్ ద్వారా సమీపంలోని కేంద్రాల గురించి సమాచారాన్ని కూడా పొందవచ్చు. మీలో కోవిడ్ లక్షణాలు కనిపిస్తే నేషనల్ హెల్ప్‌లైన్ నంబర్: 1075 (24×7 టోల్ ఫ్రీ) కు కాల్ చేయవచ్చు. మీ జిల్లాలోని కోవిడ్ నిఘా అధికారిని కూడా సంప్రదించవచ్చు. కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌లు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మీరు వారి వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా సంప్రదిస్తే.. ఇంటికి వచ్చి నమూనా సేకరిస్తారు. ప్రైవేట్ ల్యాబ్‌లో RT-PCR పరీక్ష ఖర్చు ₹500 నుంచి ₹1000 వరకు ఉంటుంది.

READ MORE: Corona virus: : 20 కి పైగా దేశాల్లో కరోనా వ్యాప్తి.. వైరస్ మళ్ళీ బలపడిందా?

Exit mobile version