Cancer Drugs in Budget 2024: కాన్సర్ రోగులకు భారీ ఉపశమనం..నెలకు రూ.40వేల ఆదా..!
- ఈ బడ్జెట్లో క్యాన్సర్ రోగులకు భారీ ఉపశమనం
- దిగుమతి చేసుకున్న క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీ తొలగింపు
- ప్రస్తుతం ముఖ్యమైన మూడు క్యాన్సర్ మందులపై 10 శాతం కస్టమ్ సుంకం
- దాన్ని తొలగించనున్నట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి
- ప్రతినెలా దాదాపు రూ.40 వేలు ఆదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో క్యాన్సర్ రోగులకు భారీ ఉపశమనం ఇచ్చింది. దిగుమతి చేసుకున్న క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీని తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటి వరకు, ముఖ్యమైన మూడు క్యాన్సర్ మందులపై 10 శాతం కస్టమ్ సుంకం ఉంది. దానిని తొలగించి సున్నాకి తగ్గించారు. దీంతో క్యాన్సర్ రోగులకు ప్రతినెలా దాదాపు రూ.40 వేలు ఆదా అవుతుంది. ఈ మూడు క్యాన్సర్ ఔషధాలు క్యాన్సర్ రోగులకు చాలా ముఖ్యం. ఐఆర్సీహెచ్ (IRCH)లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని మెడికల్ ఆంకాలజీ విభాగంలో అదనపు ప్రొఫెసర్ డాక్టర్ అజయ్ గోగియా మాట్లాడుతూ.. దిగుమతి చేసుకున్న ఈ క్యాన్సర్ మందులు చాలా ఖరీదైనవన్నారు. “బడ్జెట్లో ఈ మందులపై 10 శాతం కస్టమ్ డ్యూటీని తొలగించిన తర్వాత, వాటి ధరలలో దాదాపు 10 శాతం వ్యత్యాసం ఉంటుంది. బడ్జెట్లో లభించిన ఈ ఉపశమనం తర్వాత నెలలో రూ.4 లక్షల విలువైన వైద్యం సుమారు రూ.3.5 లక్షలకు పూర్తవుతుంది. రోగులు ప్రతి నెలా దాదాపు రూ. 40-50 వేలు ఆదా చేయగలుగుతారు.” అని ఆయన పేర్కొన్నారు. చౌకగా మారిన మందుల గురించి ఇప్పుడు చూద్దాం.
READ MORE: Polimera 2 Producer: చంపేస్తామంటున్నారు… దిల్ రాజుకు పొలిమేర 2 నిర్మాత లేఖ..!
Also Read
- Homemade Rose Water: లేడీస్ స్పెషల్.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్! గ్లోయింగ్ స్కిన్‌కు సింపుల్ సీక్రెట్ ఇదే..
- Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
- Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
- Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
ఈ మూడు క్యాన్సర్ మందులు చౌకగా మారాయి..
1. ట్రాస్టూజుమాబ్ డెరుక్స్టేకాన్ (Trastuzumab derextecan)
2. ఒసిమెర్టినిబ్ (Osimertiniv)
3. దుర్వాలుమాబ్ (Durbalumav)
READ MORE: Stock market: రుచించని సంకీర్ణ బడ్జెట్.. నష్టాల్లో ముగిసిన సూచీలు
ఏది ఏ క్యాన్సర్‌కు పనిచేస్తుంది..ధర ఎంత..?
Trastuzumab derextecan- ఈ ఔషధం అన్ని రకాల సానుకూల రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించబడుతుంది. క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించినప్పుడు, దీనిని యాంటీబాడీ డ్రగ్‌గా ఉపయోగిస్తారు. దీన్ని హెర్సెప్టిన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. సాధారణంగా క్యాన్సర్ రోగి ఈ మందును 3 వారాలకు ఒకసారి తీసుకోవాలి. దీని ఒక డోస్‌కి 3 వైల్స్ అవసరం కాబట్టి దీని ధర రూ. 4 లక్షలుగా అంచనా వేయబడింది.
Osimertiniv- ఈ ఔషధం నాన్-స్మాల్ సెల్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో లక్ష్య చికిత్సగా ఉపయోగించబడుతుంది. ఈ ఔషధం ముఖ్యంగా తరాల ఈజీఎఫ్ఆర్ (EGFR) ఇన్హిబిటర్లకు నిరోధకంగా మారిన క్యాన్సర్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. రోగి ప్రతిరోజూ ఈ మందును తీసుకోవాలి. దీని ఒక నెల డోసేజ్ దాదాపు రూ. 1.5 లక్షలు.
Durbalumav- ఇది PD-L1 ప్రోటీన్‌ను నిరోధించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను క్రియాశీలం చేయడంలో సహాయపడే ఇమ్యునోథెరపీ ఔషధం. ఇది నాన్-స్మాల్ సెల్ ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు మూత్రాశయ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించబడుతుంది. రోగి ఈ ఔషధాన్ని 3 వారాలకు ఒకసారి అంటే దాదాపు 21 రోజులకు ఒకసారి తీసుకోవాలి. ఒక డోస్ మార్కెట్ ధర దాదాపు రూ.2.5 లక్షలు ఉంటుందని అంచనా.
తాజావార్తలు
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్‌లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!