Site icon NTV Telugu

Health Tips: గ్యాస్ సమస్య..? ఈ చిట్కాలతో చెక్ పెట్టేయొచ్చు..!

Gas Trabul

Gas Trabul

నేటి కాలంలో గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. చిన్నగా కనిపించినా చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రజెంట్ అందరికీ ఉండే కామన్ ప్రాబ్లమ్ ఏంట్రా అంటే అది గ్యాస్ అనే చెప్పాలి.. ఏజ్ తో సంబంధం లేకుండా అందరికి వస్తుంది. టైంకు భోజనం చేయకకోవటం, తీవ్రమైన మానసికి ఒత్తిడి, సరిగా నిద్రలేకపోవటం, ఎక్కువ ఆలోచనలు ఇవన్నీ మితిమీరి గ్యాస్ ట్రబుల్ కి దారితీస్తున్నాయి. జాబ్స్ చేసే వాళ్లకు దాదాపు ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి. ఈ గ్యాస్ ట్రుబుల్ కారణాలేంటి, అసలు ఈ సమస్య లక్షణాలు, పరిష్కారం ఏంటో తెలుసుకుందాం.

గ్యాస్ ట్రబుల్ కు కారణాలు..
• సరైన టైంకు ఆహారం తీసుకోకపోవడం.
• కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో పనిచేయడం..
• టీ, కాఫీ అధికంగా తాగటం
• మానసిక ఆందోళనలు, దిగులు, కుంగుబాటు, ఒత్తిడి, అలసట.
• మసాలా దినుసులు, ఆహారం సరిగ్గా నమిలి మింగకపోవడం.
• మలబద్ధకం, వివిధ వ్యాధులకు వాడే మందులు,
• మధుమేహం, ఐబీఎస్ ,హార్మోన్ల అస్వవ్యస్థత తదితర కారణాలు

లక్షణాలు ఏంటీ?
గ్యాస్ ట్రుబుల్ లక్షణాలు ఇలా ఉంటాయి..
• కడుపు ఉబ్బరంగా ఉండి కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం.
• ఆహారం జీర్ణం కాక కడుపునొప్పి రావడం. మలబద్ధకం
• ఆకలి లేకపోవడం, ఛాతిలో మంట, తేన్పులు ఎక్కువగా రావడం.
• కడుపులో మంటతో కూడిన నొప్పిరావడం.

గ్యాస్ సమస్యకు ఇలా చెక్ పెట్టిండి:

గ్యాస్ ట్రబుల్ తో బాధపడేవారు టాబ్ లెట్లు వేసుకుంటూ ఉంటారు..కానీ కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్యను దూరంలో చేసుకోవచ్చు కూడా అవేంటో చూద్దాం..

గ్యాస్ సమస్యకు వెల్లుల్లి చాలా చక్కటి సహజసిద్ధమైన ఔషధం అని చెప్పొచ్చు. దీనిని తిన్నగా నమిలాలి. లేదా వెల్లుల్లి ముక్కలు, కొత్తమీర జీలకర్ర తీసుకుని ఐదు నిమిషాలపాటు నీళ్లలో ఉడికించాలి. ఈ ద్రావణాన్ని తాగితే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. గ్యాస్ సమస్యను తీర్చేందుకు కొబ్బరి నీళ్లు మంచి మందు అని చెప్పవచ్చు.. ఇందులో అసాధారణ ప్రోటీన్లు ఉంటాయి కాబట్టి రోజూ కొబ్బరి నీళ్లను తాగడం అలవాటు చేసుకుంటే ఈ సమస్య పోతుంది. గ్యాస్ సమస్యకు తాత్కాలిక ఉపశమనానికి నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. కొంచెం ఉప్పుతో నిమ్మరసం, అరస్పూన్ బేకింగ్ సోడా కలిపి తాగాలి. ఈ రసాన్ని ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది.

అజీర్తి నిర్మూలనుకు కొత్తిమీర బాగా పనిచేస్తుందట. కడుపులో మంటగా ఉన్నప్పుడు కొత్తిమీర తీసుకుంటే చాలా త్వరగా తగ్గిపోతుంది. ఒకగ్లాస్ మజ్జిగలో కొత్తిమీర వేసుకుని తాగితే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు. గ్యాస్ సమస్యకు చక్కటి పరిష్కారం అల్లం. దీనిని చిన్న ముక్కగా చేసి రోజూ భోజనానికి ముందు నమిలి తీసుకుంటే చాలా మంచిది. తిన్నగా నమలలేకపోతే చక్కెర కలుపుకోని కూడా తినొచ్చు. మిరియాలను పాలలో కలిపి తాగితే గ్యాస్ సమస్య తీరుతుంది.

దాల్చిన చెక్కను నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత వడగొట్టి తాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది. ఒక గ్లాస్ లో వేడినీటిని తీసుకుని, అందులో ఇంగువ వేసుకుని బాగా కలిపి తాగాలి. ఇలా చేస్తే గ్యాస్ సమస్య, కడుపు నొప్పి, అజీర్తి తగ్గిపోతాయి. కాబట్టి మీరు గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతుంటే.. ఈ అలవాట్లు ఉంటే వెంటనే తగ్గించుకోవటానికి ట్రై చేయండి.

Exit mobile version