NTV Telugu Site icon

కరోనా టైంలో ఇమ్యూనిటీ పెంచుకోవడం ఎలా?

కరోనా తీవ్రరూపం దాలుస్తున్న టైంలో కరోనా సోకిన వారు, కరోనా నుంచి రక్షణ పొందినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది చాలామందిని వేధిస్తుంటుంది. కరోనా నివారణకు కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా అవి కొంతమేరకే రక్షణ కల్పిస్తున్నాయని చెప్పాలి. రెండు డోస్ లు వ్యాక్సిన్ వేయించుకున్నా. మళ్లీ బూస్టర్‌ డోసు వేసుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రాణాంతక విషపు వైరస్‌ నుంచి బయటపడాలంటే..మన ఒంట్లోని వ్యాధినిరోధక యంత్రాంగం బలంగా తయారు కావాలి.

ఇమ్యూనిటీ బలంగా ఉంటే కరోనా వైరస్‌ తో పాటు ఇతర ఫ్లూ లాంటివి మన దరికి చేరవనే చెప్పాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది అంతా తెలుసుకోవాల్సిన అవసరం వుంది. గతంలో వచ్చిన వైరస్‌లతో పోల్చుకుంటే కరోనా పెద్దగా ప్రమాదకరమేమీ కాదు. కానీ మన శరీరం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోనేలా తయారుకావాలి. రోగనిరోధక శక్తి బలీయంగా ఉంటే.. కరోనా మనల్ని ఏమీ చెయ్యలేదు. ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి.

కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే భౌతిక దూరం పాటించాలి. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కూరగాయల్ని అధికంగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌ని తీసుకోవడం ఎంతోమంచిది. విటమిన్ సీ ఎక్కువగా వుండే పండ్లు, నిమ్మ, దానిమ్మ, బత్తాయి, కమల, నారింజ వంటి పండ్లను అధికంగా తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, బొప్పాయి, గ్రీన్‌ టీ వంటి వాటికి మన ఒంట్లో రోగ నిరోధకతను పెంచుతాయి. ప్రతిరోజూ ఒక బొప్పాయి తీసుకోవాలి. మన ఆహారపు అలవాట్లకు తోడుగా నిత్యం కాసేపు వ్యాయామం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి.