Heart Attack Symptoms: ఈ రోజుల్లో ఆనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ రకాల వ్యాధులు దరి చేరుతున్నాయి. ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు రావడం, టెన్షన్, ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. గుండెపోటుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు అప్రమత్తం చేస్తున్నాయి. నేడు చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండెపోటు ప్రమాదం వేగంగా పెరుగుతోంది. కొన్ని లక్షణాలను చిన్న విషయాలుగా తీసుకోవడం వల్ల చిన్న వయసులోనే గుండెపోటుతో మృత్యవాత పడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. మరి హార్ట్ ఎటాక్ వచ్చే కొన్ని రోజుల ముందు శరీరంలో కలిగే మార్పులేంటో చూద్దాం..
READ MORE: NTV Telugu Podcast: నండూరి శ్రీనివాస్ తో ఎన్టీవీ స్పెషల్ పాడ్‌కాస్ట్..
సాధారణంగా గుండెకు రక్త సరఫరా సరిగా కాకపోతే.. హార్ట్ ఎటాక్ వస్తుంది. ఈ కాలంలో ఒత్తిడి, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం, తగిన కసరత్తులు చేయకపోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి.. రక్తసరఫరాకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో సడెన్ గా గుండె పోటుతో కుప్పకూలుతున్నారు. గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందే ఎడమవైపు శరీరభాగాల్లో నొప్పి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు, ఎడమ చేయి నుంచి పైన దవడ వరకూ నొప్పి వస్తుండటం వంటివి కనిపిస్తాయి. చెమటలు విపరీతంగా వస్తుంటాయి. ఎన్ని నీళ్లు తాగినా నోరు పొడిబారినట్లే ఉంటుంది. స్పృహ తప్పే అవకాశాలు కూడా ఉంటాయి. ఛాతీ కూడా బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి.. రక్తనాళాల్లో అడ్డంకులు లేకుండా చేస్తుంది. ఓట్స్, చేపలు, వెల్లుల్లి, పెసలు వంటి ప్రతి రోజూ తీసుకుంటూ ఉండాలి.
READ MORE: flight emergency landing: జర్రుంటే చచ్చిపోయేటోళ్లు.. విమానంలో టెక్నికల్ ఇష్యూ
-
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
