NTV Telugu Site icon

Health Tips : ఉదయాన్నే ఆమ్లెట్ ను ఇలా చేసుకొని తింటే..బరువు తగ్గడం ఖాయం ..!

Omlettes

Omlettes

అధిక బరువు అనేది ఈరోజుల్లో సర్వ సాధారణం.. చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నెన్నో ట్రై చేస్తుంటారు.. సరైన ఫలితాలు ఉండక పోవడంతో నిరాశకు లోనవుతున్నారు..అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాను తీసుకొచ్చాం.. అదేంటంటే ఆమ్లెట్.. దీనితో బరువు తగ్గవచ్చునని నిపుణులు అంటున్నారు.. మరి ఎలా తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మసాలా ఆమ్లెట్..

ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుని వాటిని చిన్నగా కట్ చేయాలి. కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఓ గిన్నెలో పాలు, ఉప్పు, నల్ల మిరియాలు కలిపాలి. అందులోనే 2, 3 గుడ్లు పగలగొట్టండి. ఇప్పుడు పాన్‌లో వెన్న వేసి వేడి చేయాలి. అందులో గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసి రెండువైపులా కాల్చి తీసుకోవచ్చు..

వెజిటేబుల్ ఆమ్లెట్..

పేరులోనే ఉంది.. మొత్తం కూరగాయలతో ఆమ్లెట్ వేసుకోవడం..మీకు నచ్చిన కూరగాయల్ని చిన్నగా కట్ చేసి బటర్‌లో ఫ్రై చేయండి. ఇప్పుడు గుడ్లు పగులగొట్టి అందులోనే ఉప్పు, మిరియాల పొడి వేయాలి. ఈ మిశ్రమాన్ని కూరగాయలపై నెమ్మదిగా పోయాలి. మంట తక్కువ చేసి దీనిపై ఉల్లిపాయలు, చీజ్, కొత్తిమీర తరుగు వేయండి. కొద్దిగా ఉడికించి తీసుకోవడమే..

పాల కూరతో ఆమ్లెట్..

పాలకూర ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చెప్పనక్కర్లేదు..పాలకూర తీసుకుని వెన్న, ఆలివ్ నూనె కలపి పక్కన పెట్టండి. మరో గిన్నెలో ఉప్పు, మిరియాల పొడి వేసి ఓ గిన్నెలో గుడ్లు కొట్టండి. వెన్నతో పాన్‌పై వేయాలి. ఇప్పుడు గుడ్డు మిశ్రమాన్ని వేసి ఆమ్లెట్‌లా వేయండి. వాటిపైన పాలకూర ఆకులు, ఆలివ్, ఒరేగాన్, చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. మంటను తక్కువ చేసి ఆమ్లెట్‌ని బాగా కాల్చుకోవాలి అంతే..

మష్రూమ్ ఆమ్లెట్..

ముందుగా గిన్నెలో కొన్ని గుడ్లు గిలక్కొట్టండి. అందులో ఉప్పు, కారం, కొద్దిగా పాలు పోయండి.
ఇప్పుడు ఓ పాన్ తీసుకుని దానిని క్లీన్ చేసి పుట్టగొడుగులు ముక్కలు వేయండి. దీనిని వెన్నతో కాస్తా ఫ్రై చేసి బీట్ చేసిన గుడ్లని ఆమ్లెట్‌లా వేయండి.. పైన అనియన్, కొత్తి మీర వేసుకుంటే చాలు..

చీజ్ ఆమ్లెట్..

ఆమ్లెట్ కోసం మీకు కావాల్సిందల్లా 2 గుడ్లు, ఉప్పు, నల్ల మిరియాల పొడి, చీజ్.
ముందుగా గుడ్లని పగలగొట్టాలి. పాన్ పీద పోసి మంటను తక్కువ చేయండి. పైన కొద్దిగా చీజ్ వేయండి. దీనిని మొత్తం కరిగిపోయే వరకూ ఉంచండి.. అంతే ఆమ్లెట్ రెడీ అయినట్లే.. వీటన్నిటితో బరువును తగ్గవచ్చునని నిపుణులు అంటున్నారు.. మీరు కూడా ట్రై చెయ్యండి..