కొబ్బరి నూనెతో అద్భుతమైన 7 ఆరోగ్య ప్రయోజనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌందర్య సాధనలో, ఆరోగ్యం విషయంలో కొబ్బరి నూనెకు ఉన్న ప్రాముఖ్యత గురించి మనకు తెలిసిందే. భూమిపై సహజంగా లభించే కొబ్బరి కాయల నుండి తీసే కొబ్బరి నూనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొబ్బరి గింజలో ఖనిజాలు, విటమిన్లు నిండి ఉంటాయి. ఇది మీ శరీరాన్ని చల్లబర్చడానికి, మీకు రిఫ్రెష్ అనుభూతిని ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. కేవలం జుట్టు సంరక్షణకే కాకుండా దీన్ని అనేక వంటకాల తయారీలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె మన రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చడానికి బాగా పనిచేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్మిస్తుంది. అంతేకాక, ఇది హృదయానికి ఆరోగ్యాన్ని చేకూర్చడానికి, శరీరానికి తక్షణ శక్తినివ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని బిస్కెట్లు, స్వీట్లు, డెజర్ట్ లు తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఎండిన కొబ్బరికాయకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఇది పిండి, క్రీమ్, పాలు వంటి కొబ్బరి ఉత్పత్తులను రూపొందించడానికి ఉపయోగపడుతుంది. ఎన్నో పోషక విలువను కలిగిన కొబ్బరికాయలతో కలిగే ప్రయోజనాలపై ఓలుక్కేయండి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
Also Read
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
- Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. 'మునగాకు పొడి'.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
- Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
మీ రోజూవారి వంటకాల్లో కొబ్బరి నూనెను జోడించడం వల్ల -మీ కడుపులో కొవ్వు కరిగి శరీర బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందువల్ల, మీ వంటకాల్లో ఇతర నూనెలకు బదులు కొబ్బరి నూనెను వాడటం ప్రారంభించండి. దీనిలోని కొవ్వు ఆమ్లాలు మీరు బరువు తగ్గే ప్రక్రియను సులభతరం చేస్తాయి. అంతేకాక, ఇది మీ జీవక్రియ రేటును వేగవంతం చేయడానికి, కేలరీలను బర్న్ చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిని మెరుగుపరుస్తుంది
కొబ్బరి నూనె మీ రక్తంలోని చక్కెర స్థాయిని మెరుగుపరుస్తుంది.- మీ ఆహారంలో కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా జోడించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. దీనిలో సహజమైన చక్కెర స్థాయిలు కలిగి ఉన్నందున, శుద్ధి చేసిన ఇతర నూనెలకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది. అంతేకాక, ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనె ముఖ్యంగా డయాబెటిక్ సమస్యలకు చెక్ పెడుతుంది.
గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది
కొబ్బరి నూనె శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. మీ ఆహారంలో కొబ్బరి నూనె జోడిస్తే అది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం ఉండటం వల్ల, ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, కొబ్బరి నీళ్ళలో చక్కెర, కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల, కొబ్బరి నీళ్లు మీ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి దోహదం చేస్తుంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
క్యాన్సర్ వ్యాధికి చెక్ పెడుతుంది
కొబ్బరి నూనె దీర్ఘకాలిక క్యాన్సర్ వ్యాధిని నయం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలోని యాంటీ కార్సినోజెనిక్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. కొబ్బరి నూనెలో ఉన్న కొవ్వు ఆమ్లాలు శరీరంలో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందనీయకుండా వాటిని నిరోధిస్తాయి.
రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది
కొబ్బరి నూనె మనిషిలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.- దీనిలోని యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్ కణాలు ఫ్రీ రాడికల్స్, ఇతర హానికరమైన ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి బాగా పనిచేస్తాయి. అంతేకాక, దీనిలో లారిక్ ఆమ్లం మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఉత్తమంగా పనిచేస్తుంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది
నోటిలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించండి కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది.- దీనిలోని యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు బాడీలోని ఇన్ఫెక్షన్‌ను నివారిస్తాయి. కొబ్బరి నూనెలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. తద్వారా దంతాలు మరింత బలంగా తయారవుతాయి. ఇది చెడు శ్వాస, దంత క్షయానికి చికిత్స చేస్తుంది.
వైరస్లను చంపుతుంది
కొబ్బరి నూనె మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడే మహిళలకు ఇది ఊరట కలిగిస్తుంది.కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల వైరస్లు, హానికరమైన బ్యాక్టీరియాలను అంతం చేయవచ్చు. ఇది మూత్రాశయ వ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
తాజావార్తలు
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే ఎంత ఇష్టమో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!