NTV Telugu Site icon

Eating Biscuits: బిస్కెట్స్ ఎక్కువగా తింటున్నారా? హెచ్చరిక!

Eating Biscuits

Eating Biscuits

Eating Biscuits: కొందరు బిస్కెట్లు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు తరచుగా బిస్కెట్లను స్నాక్స్‌గా చాలా మంది తింటారు. అయితే బిస్కెట్లు తినడం మంచిదా? బిస్కెట్లు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బిస్కెట్లు ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు. ఎందుకంటే సహజంగా బిస్కెట్ల తయారీలో పిండిని ఉపయోగిస్తారు. మైదా పిండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మైదా పిండిని ఎక్కువగా తింటే మన జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. బిస్కెట్లు ఎక్కువగా తినేవారిలో కూడా మలబద్ధకం రావడానికి గల కారణమవుతుంది.బిస్కెట్ల తయారీలో మైదాతో పాటు పంచదార కూడా ఎక్కువగా వినియోగిస్తారు. మనం ఎక్కువ చక్కెర తినడం కూడా మంచిది కాదు. ఎక్కువ చక్కెర తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాదు దంతాలు కూడా పాడైపోతాయి. దంతాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

Read also: Medak Crime: దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు..

బిస్కెట్ల తయారీలో ఉపయోగించే పిండి, పంచదార, ఉప్పు, కొవ్వు పదార్థాలు మంచివి కావు. వీటి రుచికి అలవాటు పడిన చాలా మంది వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వీటిని తినడం ఆరోగ్యానికి హానికరం. ఫలితంగా, బరువు విపరీతంగా పెరుగుతుంది. వీటిలో ఉండే చక్కెర, ఉప్పు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. బిస్కెట్లలో పోషకాలు ఉండవు. బిస్కెట్లలో పీచు శాతం చాలా తక్కువ. వీటిని ఎక్కువగా తింటే పిల్లలు డయేరియా వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు బిస్కెట్లలో నీటి శాతం కూడా తక్కువే. దీని వల్ల బిస్కెట్లు ఎక్కువగా తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. అంతేకాదు బిస్కెట్లు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాల్లో రక్త సరఫరా మందగిస్తుంది. దీంతో గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తి బాధపడాల్సి వస్తుంది. కాబట్టి బిస్కెట్లు తినాలనుకునే వారు వాటి వల్ల కలిగే అనారోగ్యాలను దృష్టిలో ఉంచుకుని వాటిని తినకుండా ఉండాలి. అస్సలు తింటే చాలా పొదుపుగా తినడం మంచిది. అలా కాకుండా ప్రతిరోజూ బిస్కెట్లు చిరుతిండిగా తింటే తర్వాత బాధ పడక తప్పదు.
TGPSC Office: నేను ఒక నియంత.. టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం..

Show comments