Health: పక్కింటి పుల్లకూర రుచి అన్నట్లు ఇంట్లో వండిన ఆహరం కన్నా బయట కొని తినే ఆహరం ఎంతో రుచిగా అనిపిస్తుంది మనలో చాలామందికి. ఇంట్లో అమ్మ ఎం టిఫిన్ చేసిన అబ్బా రోజు ఇదేనా అంటాం. సరే అని అమ్మ పోపుల డబ్బాలో నుండి డబ్బులు తీసి ఇస్తే బయటకెళ్ళి అమ్మ రోజు ఇంట్లో చేసే టిఫిన్ నే బయట నుండి కొని తెచ్చుకుంటాం. ఇలా ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడు బయట ఆహారాన్ని తింటుంటారు. అయితే షాప్ లోనే తింటే పర్లేదు కానీ.. కొందరు పార్సిల్ చేయించుకుని ఇంటికి తెచ్చుకుంటారు. ఈ నేపధ్యలో చాలామంది షాప్ వాళ్ళు ఆ ఆహారాన్ని వార్త పత్రికల్లో( న్యూస్ పేపర్స్) లో ప్యాక్ చేసి ఇస్తారు. అయితే ఇలా న్యూస్ పేపర్స్ లో ప్యాక్ చేసిన ఆహారాన్ని తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని “ఎఫ్‌ఎస్ఎస్ఏఐ” వెల్లడించింది.
Read also:Body soap: సబ్బు ఖరీదు 2.07 లక్షలా.. ఏముంది ఇందులో అంత ప్రత్యేకత.. ?
న్యూస్ పేపర్స్ అనేవి రీసైకిల్ చేసిన పదార్థాలతో పేపర్లు లేదా కార్డ్‌బోర్డ్ పెట్టెలను తయారు చేస్తారు. వీటిలో హానికార రసాయనాలు ఉంటాయి. అవి జీర్ణ సంబంధ సమస్యలను కలిగిస్తాయి. అలానే పత్రికల ముద్రణ కోసం వినియోగించే సిరాలో హానికారక రంగులు, రంగుల అవశేషాలు, అలోహాలను భద్రపరిచేందుకు వాడే రసాయనాలు ఉంటాయి. వీటివల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. న్యూస్ పేపర్లలతో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను తీసుకున్న వృద్ధులు, యువకులు, చిన్నపిల్లల్లో కేన్సర్ సంబంధ వ్యాధులు కూడా సంభవిస్తాయని “ది ఫుడ్, సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా” ప్రకటించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ సలహా సంఘం ఈ నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు వివరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాటలుతూ ఆహార పదార్థాలను వార్తా పత్రికల్లో ప్యాక్ చేసి విక్రయించడం ప్రమాదకరమని.. ఇలా ప్యాక్ చేసే అలవాటుని మానుకోవాలి సూచించారు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.