Site icon NTV Telugu

Benefits of Drumsticks: మునక్కాయ తింటే అది బాగా పెరుగుతుందట.. ట్రై చేయండి సుమీ…

Drumstick

Drumstick

భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునక్కాయ ఒకటి. చెట్టు వేరు నుంచి ఆకు వరకు అన్నీ ఉపయోగపడేవే. మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్‌, ఫాస్పరస్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. చిన్నారులలో ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయి. వృద్ధులు వారి డైట్‌లో మునక్కాయ చేర్చుకుంటే.. ఎముకల సాంద్రత పునరుద్ధరిస్తుంది, ఆస్టియోపోరోసిస్‌ లక్షణాలను తగ్గిస్తుంది. మునగలోని శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్‌కు చికిత్స చేస్తాయి, ఎముక పగుళ్లు చిన్నగా ఉంటే వాటిని నయం చేస్తాయి.​

READ MORE: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. రేవంత్, ఈటల, రఘునందన్ టార్గెట్!

రోగనిరోధక శక్తి పెరుగుతుంది..!
మునక్కాయలో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్లూ, అనేక ఇన్ఫెక్షన్‌ల నుంచి రక్షణ కల్పిస్తాయి. మునక్కాయలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఆస్తమా, దగ్గు, గురక ఇతర శ్వాసకోశ సమస్యల లక్షణాలను తగ్గిస్తాయి. దగ్గు నుంచి త్వరితగతిన ఉపశమనం ఇస్తుంది. మునక్కాయ మీ డైట్‌లో చేర్చుకుంటే.. రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

READ MORE:Se*xual Assault: జైలు నుండి విడుదలై రెండు రోజులు కాలేదు.. 80 ఏళ్ల వృద్ధ మహిళపై అత్యాచారం..!

మునక్కాయలోని థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్‌, విటమిన్ B12, B వంటి పోషకాలు జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయాడనికి సహాయపడతాయి. ఇది కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులను సరళమైన రూపాల్లోకి విచ్ఛిన్నం చేయడానికి తోడ్పడుతుంది. మునక్కాయలోని డైటరీ ఫైబర్‌ పేగు కదలికలను సులభం చేసి.. గట్‌ హెల్త్‌కు మేలు చేస్తుంది.​ మీ డైట్‌లో మునక్కాయ తరచుగా చేర్చుకుంటే.. కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు వచ్చే ముప్పు తగ్గుతుంది. దీనిలో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు కిడ్నీల నుంచి టాక్సిన్స్‌ను క్లియర్‌ చేస్తాయి. కిడ్నీలపై ఒత్తిడి తగ్గించి, వాటి పనితీరు మెరుగుపరుస్తాయి. ఈ మునగ హైపర్‌టెన్షన్‌ను నియంత్రిస్తాయి. మునక్కాయలోని యాంటీ ఆక్సిడెంట్ ప్రొఫైల్ గుండెకు రక్త ప్రసరణ, పోషకాల ప్రసరణను మెరుగుపరుస్తుంది. మునక్కాయలోని విటమిన్లు ఎ, సి, బీటా కెరోటిన్, నియాజిమిసిన్ క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తాయి.

Exit mobile version