Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే

  • ఎండ నుంచి వచ్చిన వెంటనే ఐస్ వాటర్ తాగడం ప్రమాదం..
  • ఇలాంటి టిప్స్ పాటించాలని వైద్య నిపుణులు సూచన..
Cool Water

Cool Water

Summer Tips: వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ ఎండలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఎండల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కూల్ వాటర్ తాగుతుంటారు. చల్లని నీరు తాగగానే చాలా రిలీఫ్ వచ్చినట్లు అనిపించినా, ఇది చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మన శరీరం ఉష్ణోగ్రతలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటుంది. ఎండల తీవ్ర ఎక్కువగా ఉంటే చెమటలు పట్టడం, రక్త నాళాలు వ్యాకోచించడం జరుగుతుంది. శరీరంలోని ద్రవాలు చెమట రూపంలో వేగంగా బయటకు వెళ్తుంటాయి. ఇది బాడీ టెంపరేచర్‌ను తగ్గించే సహజ ప్రక్రియ. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా కూల్ వాటర్ తాగితే శరీరం ఒక్కసారిగా ‘‘టెంపరేచర్ షాక్’’కు గురవుతుంది.

ఈ సమస్యలు రావచ్చు:

కూల్ వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ తాత్కాలికంగా దెబ్బతినొచ్చు. కొందరికి కడుపులో ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. ఎండలో శరీరం డీహైడ్రేట్ అయిన తర్వాత ఐస్ వాటర్ తాగితే గొంతు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా చల్లని నీరు తాగితే నరాలపై ప్రభావం పడి తలనొప్పి రావొచ్చు. తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. సాధారణ ఉష్ణోగ్రతలో నీటిని శరీరం వేగంగా గ్రహిస్తుంది. కూల్ వాటర్ మాత్రం త్వరగా శరీరానికి చేదు.

ఎవరు జాగ్రత్త వహించాలి?

ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఇలాంటి పరిస్థితుల్లో కూల్ వాటర్‌ను తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్, సైనస్, కడుపు నొప్పి, ఎండలో ఎక్కువగా వ్యాయామం చేసేవారు ఎండ నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీరును తీసుకోకపోవడమే మంచిది.

కూల్ వాటర్ బదులు వీటిని తీసుకోండి.

ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కూల్ వాటర్‌కు బదులుగా సాధారణ ఉష్ణోగ్రత లేదా కాస్త చల్లగా ఉన్న నీటిని తీసుకోవడం బెటర్. కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ ద్రావణాలు శరీరం మెరుగుపడేందుకు సహకరిస్తాయి.

ఎండ నుంచి వచ్చిన వెంటనే ఏం చేయాలి.?

ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే 5-10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ముఖం, చేతులను సాధారణ నీటితో కడుక్కోవాలి. నీటిని నెమ్మదిగా తాగాలి. కూల్ డ్రింక్స్ తాగొద్దు. రోజు మొత్తం తరుచుగా నీటిని తాగుతూనే ఉండాలి.