NTV Telugu Site icon

Health: పైసా ఖర్చు లేదు! గ్లాసు నీళ్లలో ఇది కలుపుకొని తాగారంటే మీకు తిరుగుండదు!

Health

Health

మారుతున్న జీవన శైలి హ్యూమన్ లైఫ్ స్టైల్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. పౌష్టికాహార లోపం, సరైన నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి కారణంగా తరచూ రోగాల భారిన పడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహిస్తే ఆసుపత్రులను మర్చిపోవచ్చు. మెరుగైన ఆరోగ్యం కోసం వంటింట్లో లభించే పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి తిరుగుండదు. పైసా ఖర్చు లేకుండానే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. గ్లాస్ నీళ్లలో ఇది కలుపుకుని తాగితే మీకు తిరుగుండదు.

రోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాస్‌ మంచి నీళ్లు తాగితే మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. అందులోను కాస్త గోరు వెచ్చని నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. అయితే.. ఆ గ్లాసు నీళ్లోనే రూపాయి ఖర్చు లేకుండా మన వంటింట్లో దొరికే ఓ పదార్థాన్ని కలుపుకుని తాగితే మరింత ప్రయోజనం ఉంటుంది. అది కూడా పెద్ద మోతాదులో ఏం కాదులేండీ.. జస్ట్‌ చిటికెడంటే చిటికెడు కలిపి తాగితే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఆ పదార్థం మరేదో కాదండి పసుపు. ఇది వంటల్లో వాడే ముఖ్యమైన దినుసు. పూర్వ కాలం నుంచి ఔషదంగా, సౌందర్య సాధనంగా ఉపయోగిస్తున్నారు.

వంటల్లో వాడే పసుపును ఒక చిటికెడు తీసుకొని.. గ్లాసు నీళ్లలో బాగా కలుపుకోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత గ్లాసు నీళ్లలో కొంచెం పసుపు కలుపుకుని తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ సెప్టిక్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. నీళ్లలో పసుపు వేసుకుని తాగితే.. చాలా వాధ్యుల నుంచి రక్షణ పొందవచ్చు. పసుపు నీళ్లు తాగితే వాత, పిత్త, కఫ అనే మూడు ఆరోగ్య సమస్యలు ఉండవు.

మన బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్‌, మురికి బయటికి పంపి, అంతర్గత శుభ్రతకు ఉపయోగపడుతుంది. రోజూ ఉదయాన్నే ఈ పసుపు నీళ్లు తాగితే మెటబాలిజం పెరుగుతుంది. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. మలబద్ధకం, కడుపులో గ్యాస్‌, ఉబ్బరం, అజీర్తీ, అసిడిటీ సమస్యలను కూడా దూరం చేస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఈ పసుపు నీళ్లు మంచి ఔషధం అని చెప్పవచ్చు. డిప్రెషన్ డిసార్డర్స్, ఆంక్సిటీ ల నుంచి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది.