NTV Telugu Site icon

Stomach Pain Reasons: మహిళలకు సాధారణ సమయాల్లో కడుపు నొప్పి వస్తుందా? జాగ్రత్త?

Stomach Pain

Stomach Pain

మహిళల్లో చాలా మందికి నెల వారీ రుతుక్రమం సమయంలో నొప్పి వస్తుంది. సాధారణంగా ఈ నొప్పి పొత్తికడుపు కండరాలు పట్టేసినట్లుగా ఉంటుంది. ఆ నొప్పి అక్కడి నుంచి వీపు మీదకు, తొడలకు, కాళ్లకు, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించవచ్చు. పీరియడ్ సమయంలో ఈ నొప్పి ఓ మాదిరిగా, హెచ్చుతగ్గులు లేకుండా ఉండవచ్చు. లేదంటే తీవ్రంగా, బాధాకరంగా తెరలు తెరలుగా వచ్చి పోతుండవచ్చు. ఈ సమయంలో మహిళలకు తలనొప్పి, వాంతులు అవుతున్నట్లుగా ఉండటం, విరేచనాలు కూడా రావచ్చు. వాస్తవమేమిటంటే.. పీరియడ్ సమయంలో వచ్చే ఈ నొప్పి ఒక్కో మహిళకు ఒక్కోలా ఉంటుంది. చాలా తేడాలు ఉంటాయి. శరీరంలో నొప్పి కచ్చితంగా ఎక్కడ పుడుతోంది అనే దగ్గరి నుంచి.. ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంది అనే దాని వరకూ ఈ తేడాలు ఉంటాయి.

READ MORE: CM Revanth Reddy : పద్మవిభూషణ్ నాగేశ్వర రెడ్డి భారత రత్నకు కూడా అర్హుడు

కాగా.. పీరియడ్స్ మాత్రమే కాకుండా కొంత మందికి తరచూ.. కపుడు నొప్పి వస్తుంది. వారికి కడుపు నొప్పి రావడానికి ఇవి కారణాలు కావచ్చు. కొంతమంది మహిళలకు పొత్తికడుపు మధ్య భాగంలో నొప్పి వచ్చి ఇబ్బంది పడుతుంటారు. ఇలా వస్తే గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్, అండాశయాల్లో ఏదో ఒక దానిలో నొప్పి వస్తున్నట్లు భావించాలని నిపుణులు అంటున్నారు. ఇది ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్, అండాశయాల్లో సిస్టులు వంటి సమస్యలకు సూచన కావచ్చని వివరిస్తున్నారు. వీటిని నిర్లక్ష్యం చేస్తే గర్భస్రావం జరగడం లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (పిండం గర్భాశయం బయట పెరగడం) వంటి క్లిష్టమైన సమస్యలు ఎదురుకావచ్చని అంటున్నారు. కాబట్టి పొత్తికడుపు మధ్య భాగంలో తరచూ నొప్పి వస్తుంటే మాత్రం వైద్యులను సంప్రదించి అసలు సమస్యేంటో నిర్ధరించుకోవాలని సూచిస్తున్నారు. తరుచూ కడుపు నొప్పి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.