Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dandruff: చుండ్రు సమస్య చాలామందిని తరచూ వేధిస్తుంటుంది. యాంటీ-డాండ్రఫ్ షాంపూ వాడిన తర్వాత కొన్ని రోజులు స్కాల్ప్ శుభ్రంగా కనిపించినా.. ఆ తర్వాత మళ్లీ తెల్లటి పొరలు, దురద మొదలవుతుంటాయి. అయితే డాండ్రఫ్ ప్రతి ఒక్కరిలో ఒకే కారణంతో వస్తుండదని, కొందరిలో ఇది దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పలువురు చర్మవ్యాధి నిపుణులు మాట్లాడుతూ.. కొందరిలో డాండ్రఫ్‌ను పూర్తిగా నిర్మూలించడం కంటే దీర్ఘకాలం నియంత్రణలో ఉంచడంపైనే దృష్టి పెట్టాలన్నారు. మన స్కాల్ప్‌లో ఉండే సెబేషియస్ గ్లాండ్స్ సహజసిద్ధమైన నూనె అయిన సెబమ్‌ను ఉత్పత్తి చేస్తాయని, కొందరిలో ఇవి ఎక్కువగా పనిచేయడంతో స్కాల్ప్ అధికంగా ఆయిలీగా మారుతుందన్నారు. ఈ పరిస్థితి Malassezia అనే ఈస్ట్ పెరుగుదలకు అనుకూలంగా ఉంటుందని, ఈ ఈస్ట్ సాధారణంగా చర్మంపై ఉన్నప్పటికీ.. కొందరిలో దాని వల్ల స్కాల్ప్‌లో ఇన్ఫ్లమేషన్ పెరిగి, చర్మ కణాలు వేగంగా రాలిపోతాయని చెప్పారు. ఇవే తెలుపు లేదా పసుపు రంగు ఫ్లేక్స్‌గా కనిపిస్తాయని వెల్లడించారు. అందుకే ఒకే ఇంట్లో ఉండే ఇద్దరిలో ఒకరికి తరచూ డాండ్రఫ్ వస్తుంటే.. మరొకరికి ఎలాంటి సమస్య లేకపోవచ్చన్నారు.
కేవలం షాంపూ చేస్తే సరిపోదట..
జుట్టు కడగడంతో పాటు స్కాల్ప్‌ను సరిగ్గా శుభ్రం చేయడం కూడా ముఖ్యమే అని చెప్పారు. నూనె, చనిపోయిన చర్మ కణాలు, చెమట, దుమ్ము వంటి పదార్థాలు స్కాల్ప్‌పై పేరుకుపోతే ఫ్లేకింగ్ మరింత ఎక్కువగా కనిపించవచ్చన్నారు. అయితే డాండ్రఫ్ ఉందని రోజుకు పలుమార్లు తలస్నానం చేయడం కూడా సరైన పద్ధతి కాదని చెప్పారు. అతిగా లేదా తప్పుగా షాంపూ ఉపయోగించడం వల్ల స్కాల్ప్ మరింత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉందని, కాబట్టి స్కాల్ప్, జుట్టు అవసరాలకు అనుగుణంగా హెయిర్ వాష్ ఫ్రీక్వెన్సీని నిర్ణయించుకోవాలన్నారు. స్కాల్ప్ సహజంగానే ఎక్కువ ఆయిలీగా ఉండటం లేదా తరచూ డాండ్రఫ్ వచ్చే స్వభావం ఉన్నవారిలో.. కొన్ని రోజుల చికిత్సతో సమస్య శాశ్వతంగా పోయిందని భావించకూడదని చెప్పారు. యాంటీ – డాండ్రఫ్ షాంపూలు దురద, ఫ్లేక్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయని అన్నారు. అయితే ఈ సమస్యతో తరచూ ఇబ్బంది పడుతున్న వారికి వైద్యుల సూచన మేరకు మెయింటెనెన్స్ కేర్ అవసరం కావచ్చని సలహా ఇచ్చారు. మొత్తంగా డాండ్రఫ్‌ను పూర్తిగా ఒక్కసారిగా తొలగించడం కంటే.. సరైన స్కాల్ప్ కేర్, అవసరమైన చికిత్సతో దాన్ని దీర్ఘకాలం నియంత్రణలో ఉంచడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!