మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి రోజూ తగినంత నీరు తాగడం తప్పనిసరి. నీరు మనల్ని హైడ్రేట్‌గా ఉంచి, శరీరంలోని మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. అయితే, శరీరాన్ని శుభ్రపరచడానికి ఎంత నీరు త్రాగాలి? అనే ప్రశ్నకు చాలా మంది దగ్గర సమాధానం ఉండదు. నీరు తక్కువగా తాగినా? ఎక్కువగా తీసుకున్నా.. ఆరోగ్యానికి నష్టం జరిగే అవకాశం ఉంది. రోజూ ఎన్ని నీళ్లు తాగాలి అనే ప్రశ్న అందరికీ వస్తుంది. కానీ.. రోజుకు ఎంత నీరు తాగాలి అనే నియమం అందరికీ ఒకేలా ఉండదని నిపుణులు అంటున్నారు. ప్రతీ కణం, కణజాలం, అవయవం సరిగా పనిచేయటానికి నీరు తప్పనిసరిగా అవసరం ఉంటుందున్నారు.
READ MORE: Rashmika: పుష్ప 2 ప్రెస్ మీట్లో బ్లాక్ మ్యాజిక్ చేసిన రష్మిక… హీటెక్కించింది పో
అందుకే మన శరీరానికి ద్రవాలు ఎందుకు అవసరమని తెలుసుకుంటే రోజుకు ఎంత నీరు తాగాలని అంచనాకు రావొచ్చని వివరించారు. వాస్తవానికి రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలని అనేక అధ్యయనాలు సిఫారసు చేస్తున్నాయి. అయితే.. మనకు ఎంత నీరు అవసరమనేది ఆరోగ్యం, ఉష్ణోగ్రత, శారీరక శ్రమ, పనుల వంటి వాటి ఆధారపడి ఉంటుందట.ఇదిలా ఉండగా.. ముఖ్యంగా జలుబు, తలనొప్పి , జ్వరంతో బాధపడుతున్న వాళ్లు నీరు తాగొచ్చా? అనే సందేహం వస్తుంటుంది. ఈ డౌట్‌పై నిపుణులు ఏం చెప్పారో తెలుసుకుందాం..
READ MORE:Thirumangai Alwar Idol: ఇండియాకి రానున్న దొంగిలించబడిన ‘‘తిరుమంగై ఆళ్వార్’’ విగ్రహం..
తలనొప్పిగా అనిపించినప్పుడూ నీళ్లు తాగడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఒంట్లో నీటిశాతం తగ్గినప్పుడు కూడా తలనొప్పి ప్రేరేపితమయ్యే అవకాశం ఉంటుందట. మూత్రం, చెమట, మలం ద్వారా మలినాలు బయటకు పోవటానికి.. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉండటానికి, కీళ్లు తేలికగా కదలటానికి సున్నితమైన కణజాలాలు దెబ్బతినకుండా ఉండటానికి నీరు తోడ్పడుతుందట. అందుకే శరీరంలో నీటి శాతం తగ్గితే ఇలాంటి పనులన్నీ మందగిస్తాయని నిపుణులు వివరించారు. కాబట్టి కొద్దిపాటి నీరు తగ్గినా శక్తి, ఉత్సాహం సన్నగిల్లి అలసట ముంచుకొస్తుందని వెల్లడించారు.