Watermelon : షుగర్ పేషెంట్లు పుచ్చకాయ తినొచ్చా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతమున్న కాలంలో జబ్బుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తినే ఆహారం, జీవన విధానంలో మార్పులు, మానసిక ఒత్తిడి, ఉద్యోగంలో ఉత్తిడి ఇలా రకరకాల కారణాల వల్ల మానవుడు ఆరోగ్యం బారిన పడుతున్నాడు. మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటుంది. జీవన విధానంలో మార్పులు చేసుకుంటే సుఖమయమైన జీవితాన్ని గడపవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక జీవన శైలి కారణంగా అనారోగ్య సమస్యలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్లు బారిన పడేవారు చాలా మందే ఉన్నారు.
ఇంతకముందు పట్టణాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ జబ్బులు ఇప్పుడు పల్లెల్లోనూ వ్యాపిస్తున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉందంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు. అయితే ఈ స్థాయిలో బీపీ, షుగర్ బాధితులుండటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ రెండు ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేక వివిధ వ్యాధులు చుట్టుముడుతున్నాయి.
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
అయితే షుగర్ బారిన పడ్డవారికి తియ్యగా వుండేవి ఏవైనా సరే తినకూడదు అనేది వైద్యుల సలహా. కానీ.. ఈపుచ్చకాయ తీయ్యగా ఉండటం వల్ల దీన్ని తినొచ్చా లేదా అని చాలామందికి ఓ సందేహం ఉంటుంది. అయితే పుచ్చకాయ విషయంలో ఆ భయం అక్కర్లేదు అంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఆయా ఆహార పదార్థాల్లోని గ్లూకోజ్ రక్తంలో ఎంత వేగంగా కలుస్తుందనేదాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్(జీఐ)తో సూచిస్తారు. ఇది అధికంగా ఉండే పండ్ల విషయంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుచ్చకాయలో జీఐ 72 శాతం ఉంటుంది. కానీ ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండి పిండిపదార్థం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పుచ్చకాయ తిన్నప్పుడు వెంటనే గ్లూకోజ్ పెరిగినప్పటికీ వెంటనే తగ్గిపోతుంది. కాబట్టి నిరభ్యంతరంగా పుచ్చకాయను తినొచ్చుని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!