NTV Telugu Site icon

Caffeine: కెఫిన్‌తో ఊబకాయం, డయాబెటిస్ దూరం.. తాజా అధ్యయనంలో వెల్లడి..

Coffee

Coffee

Caffeine: కాఫీ అతిగా తాగితే అనర్థాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే కాఫీలో ఉండే కెఫిన్ వల్ల ఊబకాయం, డయాబెటిస్ వంటివి వచ్చే ప్రమాదం తగ్గుతుందని తాజా అధ్యయనం కనుగొంది. అధిక స్థాయిలో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుందని, టైప్ 2 డయాబెటిస్ తో పాటు గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది.

బీఎంజే మెడికల్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం కెఫిన్ ఉపయోగాలను వెల్లడించింది. ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ తగ్గించేందుకు క్యాలరీ ప్రీ కెఫిన్ పానీయాలు ఉపయోగపడుతాయని వెల్లడించింది. అయితే దీనికి మరిన్ని పరిశోధనలు అవసరం అని తెలిపింది. సాధారణంగా టైప్ 2 డయాబెటిస్ శరీరం తగినంత ఇన్సులిన్ హార్మోన్ విడుదల చేయనప్పుడు ఏర్పడుతుంది.

Read Also: Air Hostess Archana: వీడిన ఎయిర్‌హోస్టెస్ మృతి మిస్టరీ.. అతడే చంపేశాడు

అయితే ఇది ఎక్కువగా కాఫీలు తాగడం గురించి అధ్యయనం చేయడం లేదని పరిశోధకులు వెల్లడించారు. ఇది ఈ పరిశోధన ఉద్దేశ్యం కాదని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్‌లోని సీనియర్ లెక్చరర్, పరిశోధకుడు డాక్టర్ కటారినా కోస్ అన్నారు. మెండెలియన్ రాండమైజేషన్ అనే సాంకేతికను ఉపయోగించి ఈ పరిశోధన చేశారు. ఇది జెనటిక్ ఎవిడెన్స్ ద్వారా కారణాలను, ప్రభావాన్ని తెలియజేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.

కెఫిన్ ఎక్కువగా జీవక్రియ వేగంతో సంబంధం కలిగి ఉన్నట్లు, తక్కువ బాడీ మాస్ ఇండెక్స్, శరీర కొవ్వుతో సంబంధం కలిగి ఉన్నట్లు తేల్చింది. టైప్ 2 డయాబెటిస్ రిస్క్ బరువు తగ్గడం వల్ల అరికట్టవచ్చని, జీవక్రియ రేటును పెంచడానికి శరీరంలోని కొవ్వును తగ్గించడానికి, ఆకలిని తగ్గించడానికి కెఫిన్ ఉపయోగిపడుతున్నట్లు కనుగొనబడింది. ప్రతీ రోజూ 100 ఎంజీ కెఫిన్ తీసుకోవడం వల్ల 100 కేలరీల శక్తి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని వార్విక్ యూనివర్సిటీ అసోసియేట్ క్లినికల్ ప్రొఫెసర్ డాక్టర్ స్టీఫఎన్ లారెన్స్ మెండెలియన్ తెలిపారు.

Show comments