NTV Telugu Site icon

Health Tips: ఇంగువతో స్పెషల్ అరోమా మాత్రమేకాదు.. ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు!

Asafoetida

Asafoetida

ఇంగువ దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. వంటల్లో సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తుంటారు. ఇంగువ సువాసన కోసం మాత్రమే కాదు బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇంగువ ఔషధ గుణాలు కలిగి ఉండడంతో పలు రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు తీసుకుంటుంటారు. ఇంట్లో పప్పు లేదా సాంబార్, పులిహోర వండేటప్పుడు తాళింపులో వేసే కచ్చితమైన పదార్థం ఇంగువ. ఇంగువ జోడిస్తే ఈ పదార్థాలకు స్పెషల్ అరోమా వస్తుంది. ఇంగువ కేవలం స్మెల్, టేస్ట్ మాత్రమే తీసుకు రాదు.. ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా తలనొప్పిని తరిమి కొట్టేందుకు సాయం చేస్తుంది ఇంగువ.

Also Read: Valentines Day: బ్లింకిట్, స్విగ్గీలో రికార్డ్ స్థాయిలో సేల్.. ఎక్కువ కొన్నవి ఏవంటే..!

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లు తీసుకుని అందులో చిటికెడు ఇంగువ వేసి, కరిగాక తాగితే మంచి ఫలితం ఉంటుంది. సాధారణ తలనొప్పి మాత్రమే కాదు మైగ్రేన్ తలనొప్పి ఉన్న కూడా దూరం అవుతుంది. అలాగే జలుబు, దగ్గు వంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. అర టీ స్పూన్ ఇంగువ పొడి, తేనే, అల్లం రసం కలిపి తీసుకోవాలి. ఇంగువలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు శ్వాసకోశాన్ని క్లియర్ చేస్తాయి. వంటల విషయంలోనే కాదు.. ఆరోగ్య విషయంలో ఆడవారికి ఎంతో మేలు చేస్తుంది ఇంగువ.

Also Read:Anji Reddy Chinnamile: నెరవేర్చలేని హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు ఓట్లతో బుద్ధి చెప్పాలి

పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. నెలసరి సమయంలో నీళ్లల్లో చిటికెడు ఇంగువ పొడి కలిపి తీసుకోవడం వల్ల నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. గ్యాస్‌, అసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కడుపులో ఇన్ఫెక్షన్ తొలగిస్తుంది. అయితే ఇంగువను మీతి మీరి వాడటం మంచిది కాదంటున్నారు నిపుణులు. వైద్యుల సలహామేరకు వినియోగించడం మంచిదని సూచిస్తున్నారు.