Site icon NTV Telugu

Anemia: మగవారిలో రక్తహీనతకు.. కడుపులో క్యాన్సర్‌ కారణం..!

Anemia

Anemia

రక్తహీనత అంటే శరీరంలో రక్తం లేకపోవడం. ఇది సాధారణంగా మహిళలతో కనెక్ట్ చేయడం ద్వారా మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది మహిళల్లో హిమోగ్లోబిన్ అవసరం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. స్త్రీల శరీరంలో రక్తహీనతకు సరైన పోషకాహారం లేకపోవడం ప్రధాన
కారణం. పీరియడ్స్ సమయంలో కూడా మహిళలు ప్రతినెలా చాలా రక్తాన్ని కోల్పోతారు.

READ MORE: Operation Sindoor: పాక్ ప్రయోగించిన “టర్కీ బైరక్తర్ డ్రోన్ వలయాన్ని” భారత్ ఎలా ఛేదించింది..?

ఆడవారిలో సహజమైన రక్తహీనత.. మగ వారిలో కనిపిస్తే కచ్చితంగా కారణం కోసం వెతకాలి. 50 సంవత్సరాల వయసు దాటిన మగవారిలో రక్తహీనతకు గల ఒక ముఖ్య కారణం, కడుపులో క్యాన్సర్. అందుకే, మగ వారిలో రక్త హీనత ఉంటే, తప్పకుండా కారణం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానికి ఎండోస్కోపీ, అవసరమైతే కొలనోస్కోపీ చేయవలసి ఉంటుంది. అలాంటి వారికి కొద్ది రోజులు ఆలస్యం చేసినా పరిస్థితి చెయ్యి జారీ పోయే ప్రమాదం ఉంది.

READ MORE: Ukraine Russia War: ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడిలో, 40 రష్యన్ విమానాలు ఖతం..

మద్యం బాగా తాగే వారిలో అయితే విటమిన్ బీ12 లోపం వల్ల, బీపీ, షుగర్ వంటి ఏదైనా దీర్ఘ కాలిగ జబ్బులతో బాధ పడుతున్న వారిలో అయితే, మూత్రపిండాల సమస్యల వల్ల, రక హీనత కలిగే అవకాశముంటుంది. అన్ని సందర్భాల్లో కారణం కచ్చితంగా తెలియక పోవచ్చు. కానీ, తెలుసుకునే ప్రయత్నం చేయడం అనేది ఆరోగ్యానికి మంచిది.

Exit mobile version