Health Tips: ఈ సీజన్ లో దొరికే వాటిలో ఉసిరికాయలు కూడా ఒకటి.. రుచికి పుల్లగా, వగరుగా ఉన్నా కూడా వీటిని ఎక్కువగా తినడానికి ఇష్ట పడతారు.. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరిని ఆరోగ్యానికి నిధిగా భావిస్తారు.. దాంతో ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది.. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఉన్నాయి. ఉసిరికాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది కాకుండా ఉసిరి రక్తంలో చక్కెర, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎముకలను బలపరుస్తుంది.. ఈ కాయలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరం వైరస్ లు, బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఉసిరికాయ తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది.. ఆమ్లాలో తగినంత కొల్లాజెన్ లభిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. ఉసిరికాయ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తాగడం వల్ల ముడతల సమస్య తగ్గుతుంది.. మచ్చల సమస్య కూడా తగ్గుతుంది.. ఉసిరి రోగ నిరోధకతను మెరుగు పరుస్తుంది.. ఇంకా జలుబు, దగ్గు సర్వసాధారణం. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీని రోజువారీ వినియోగం జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఉసిరికాయతో తేనె కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, ఇతర సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి…
ఇక శరీరంలో రక్త పరిమాణం, హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా అన్ని అవయవాలకు సరైన పోషకాలు అందుతాయి. శరీరం బాగా పనిచేస్తుంది. ఉసిరికాయను తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా దరిచేరవు.. ఇక ఉసిరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.. మలబద్ధకం, విరేచనాలు మొదలైన సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.. అంతేకాదు ఉసిరి నూనె జుట్టును బలపరుస్తుంది. చుండ్రు నుండి ఉపశమనం పొందుతుంది. ఆమ్లా ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల జుట్టు నల్లగా ఉంటుంది.. ఇంకా ఎన్నో సమస్యలను ఉసిరి తగ్గిస్తుంది..
BJP vs BRS: నిజామాబాద్‌లో టెన్షన్ టెన్షన్.. 144 సెక్షన్ అమలు