Site icon NTV Telugu

Heart Attacks: ఈ ఐదు నియమాలు పాటిస్తే.. గుండెపోటు ప్రమాదాన్ని 80% తగ్గించవచ్చు..!

Heart Attack

Heart Attack

Heart Attacks: క్యాన్సర్, కాలేయం వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రజలను వేధిస్తున్నాయి. అదే స్థాయిలో గుండె సంబంధిత సమస్యలు కూడా పెరిగాయి. ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. మానసిక ఒత్తిడి, అనారోగ్యకర ఫాస్ట్‌ఫుడ్‌ తినటం పెరగటం, శారీరక శ్రమ లేకపోవటం, వ్యాయామం చేయకపోవటం వంటివి ఇటీవల ఆరోగ్యానికి పెద్ద శత్రువులుగా మారుతున్నాయి. ఈ అంశంపై తాజాగా వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ శుభవార్త చెప్పింది. దీని ప్రకారం.. కేవలం ఐదు నియమాలు పాటిస్తూ 80% వరకు గుండెపోటు, స్ట్రోక్‌లను నివారించవచ్చు. ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

READ MORE: Akshay Kumar : డబ్బు, ఫేమ్‌, సక్సెస్‌ సెకండరీ.. మనశ్శాంతే ఫస్ట్‌

1. భోజనం అనంతరం నడక: భోజనం చేసిన వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం చేయరాదు. ప్రతిరోజూ తిన్న తరువాత 10–15 నిమిషాల నడక అలవాటు చేసుకోండి. భోజనం తర్వాత తేలికపాటి నడక రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ చిన్న నడక ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.

2. ఒమేగా-3 : ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండెకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. నూనె ఆధారిత మాత్రలకు బదులుగా.. ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఒమేగా-3 కలిగిన సాల్మన్, వాల్‌నట్స్, అవిసె గింజలు లేదా చియా విత్తనాలను మీ ఆహారంలో చేర్చుకోండి. ఒమేగా-3లు రక్తంలోని చెడు కొవ్వును తగ్గిస్తాయి. ధమనుల్లోని అడ్డంకులను నివారిస్తాయి. దీంతో గుండెకు రక్త ప్రసరన సవ్యంగా జరుగుతుంది.

3. మంచి నిద్ర : నిద్ర విశ్రాంతికి మాత్రమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. రోజుకు ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గాఢ నిద్ర రక్తపోటును నియంత్రించడంలో, ధమనులను విశ్రాంతి పర్చడంలో సహాయపడుతుంది. అందువల్ల.. రోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోండి. మొబైల్ ఫోన్లు లేదా టీవీ చూడటం మానేయండి.

4. ప్లాస్టిక్ కు బదులుగా గాజు లేదా స్టీల్ బాటిళ్లు: ప్లాస్టిక్ సీసాలు, డబ్బాల్లో ఉండే BPA వంటి రసాయనాలు హార్మోన్లను అంతరాయం కలిగిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. నీటి కోసం గాజు లేదా స్టీల్ బాటిళ్లను వాడండి. ప్లాస్టిక్ కంటైనర్లలో వేడి వేడి ఆహారాన్ని ఉంచకండి.

5. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు: గుండె జబ్బులు తరచుగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. వెంటనే బయటపడవు. కాబట్టి, షుగర్, కొలెస్ట్రాల్, రక్తపోటును ఏడాది ఒకటి లేదా రెండు సార్లు చెక్ చేసుకోండి. మీ కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బుల చరిత్ర ఉంటే.. ఈ పరీక్షలు తప్పనిసరి.

 

 

 

Exit mobile version