NTV Telugu Site icon

Health Tips : షుగర్ పేషంట్స్ పరగడుపున ఖాళీ పొట్టతో తినాల్సిన సూపర్ ఫుడ్స్‌ ఇవే..!

Sugar Rogulu

Sugar Rogulu

రాత్రికి ఉదయానికి చాలా సమయం ఉంటుంది.. అందుకే ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.. రోజంతా శరీరం ఉత్తేజంగా ఉండి, ఉత్సహంగా పని చేయాలంటే పరగడుపున తినే ఆహారం బ్రేక్‌ ఫాస్ట్‌ ముఖ్య పాత్ర పోషిస్తుంది.. ఇక షుగర్ పేషంట్స్ బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.. కడుపునిండా తినడమే కాకుండా..రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. మీరు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ వల్ల షుగర్ స్థాయిలను అధికంగా చేసే ఫుడ్ ను తింటే రోజంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మధుమేహం ఉన్నవారిలో ఉదయానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మన కాలేయం అదనపు గ్లూకోజ్‌ని ఉత్పత్తి చేస్తుంది… అందుకే జాగ్రత్తగా ఆహారాన్ని తీసుకోవాలి..

షుగర్ ఉన్నవారు ఖాళీ కడుపుతో ఒక స్పూను ఆవు నెయ్యిలో చిటికెడు పసుపు కలుపుకునే తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆ రోజంతా మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా కాపాడుతుంది. అలాగే తీపి పదార్థాలు తినాలన్న కోరికలను కూడా నియంత్రిస్తుంది. నెయ్యి పొట్ట నిండిన భావనను పెంచుతుంది. పసుపు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.. అలాగే మన వంటగదిలో ఉండే ఎన్నో మసాలా దినుసులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి..

అందులో దాల్చిన చెక్క వల్ల మధుమేహలుకు ఎంతో ఉపయోగం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు దోహదం చేస్తుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.. దాల్చిన చెక్కతో తయారు చేసుకున్న టీ పరగడుపునే తాగితే మంచిది.. మెంతి నీరు మధుమేహలకు నిజంగానే సూపర్ ఫుడ్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పరగడుపునే మెంతి నీరు తాగినట్టయితే శరీరం కార్బోహైడ్రేట్లను శోషించుకోకుండా కాపాడుతుంది.

ఒక టీ స్పూన్ మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం లేచాక ఆ నీటిని తాగేయాలి. ఆ గింజలను కూడా నమిలి మింగేయాలి.. ఇలా చెయ్యడం వల్ల మీ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చెయ్యవచ్చు.. ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సిడర్ వెనిగర్ తాగిన కూడా మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ రెండు అందుబాటులో లేకుంటే.. గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి పరగడుపున తాగినా కూడా ఉత్తమం అంటున్నారు.. ఉదయం నానబెట్టిన బాదంను తీసుకోవడం కూడా మంచిదే అంటున్నారు నిపుణులు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.