Site icon NTV Telugu

Health Tips : ఈ స్మూతీని రోజూ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలో..

Smoothies

Smoothies

ఈరోజుల్లో ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా ఏదొక జబ్బులు వస్తూనే ఉన్నాయి.. అందుకే ఆహారపు అలవాట్లను కొద్దిగా మార్చుకుంటే సరిపోతుంది.. డైట్ ఫాలో అయ్యేవాళ్ళు కొన్ని పానీయాలను, స్మూతిలను రెగ్యులర్ గా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు మనం స్మూతిలను తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు,ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

స్మూతీని ఎలా తయారు చేసుకోవాలంటే..

బ్లెండ‌ర్‌ తీసుకుని అందులో మూడు నుంచి నాలుగు స్ట్రాబెర్రీలను వేసుకోవాలి. అలాగే ఒక కప్పు ఆరెంజ్ పల్ప్, అర కప్పు దానిమ్మ గింజలు, ఒక అరటిపండు, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, మూడు లేదా నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న స్మూతీలో వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న చియా సీడ్స్ ను మిక్స్ చేసుకోవాలి. ఈ స్మూతీని రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తీసుకోవాలి.. ఒకవేళ నైట్ కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు..

ఈ స్మూతీ మిమ్మల్ని రోజు మొత్తం ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది. డైట్ లో ఈ స్మూతీని చేర్చుకుంటే ఇమ్యూనిటీ సిస్టం పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు వచ్చే రిస్క్‌ తగ్గుతుంది. వెయిట్ లాస్ అవుతారు. చర్మం ఆరోగ్యంగా నిగారింపు గా మారుతుంది.జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది.. బీపిని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది..ప్రతి రోజూ ఈ ఫ్రూట్స్ స్మూతీని తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. దాంతో రక్తహీనత ప‌రార్ అవుతుంది. అంతేకాదు ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది. గుండెపోటు, క్యాన్సర్, మధుమేహం వంటి ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. మీకు కావాలనుకుంటే తేనెను కూడా వేసుకోవచ్చు..

Exit mobile version