గర్భిణీలు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎలాంటివీ తిన్నా.. తినకున్నా షుగర్ అనేది వస్తుంది.. ఇది ప్రధాన సమస్యగా మారింది.. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని కూడా అంటారు..సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల, అధిక బరువు, శరీరతత్వం బట్టి.. ఇలా రకరకాల కారణాల వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతూంటాయి. ఇది సాధారణంగా 6 నెలల తర్వాత బయటపడుతుంది. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల గర్భిణులు చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఉమ్మనీరు పెరగటం, బిడ్డ ఎక్కువగా బరువు పెరగడం, నెలలు నిండకుండానే డెలివరీ అవ్వడం, మరీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే బిడ్డ కడుపులోనే చనిపోవటం వట్టి సమస్యల ఎదురవుతాయి.. ఈ సమస్యతో బాధ పడే మహిళలు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటీస్ తో బాధపడే వారు ఫైబర్ రిచ్ ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతూంటారు. అంటే తృణధాన్యాలు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఆహార పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి.. అంతేకాదు చాలా సేపు వరకు ఆకలి లేకుండా ఉండేలా చేస్తుంది..
లీన్ ప్రొటీన్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడతాయి. చిక్కుళ్లు, టోపు, చికెన్ లో లీన్ ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. అవకాడో, డ్రైఫ్రూట్స్, నట్స్, అలీవ్ నూనె తీసుకుంటే చాలా మంచిది. బ్రోకలీ, బచ్చలికూర, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అందుకే మీ డైట్ లో చేర్చుకోవడం మంచిది.. ఇకపోతే ఉప్పు చాలా తక్కువగా తీసుకోవడం మంచిది..ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్ బాగా తగ్గించేయాలి. తక్కువ ఫ్యాట్ డైరీ ఉత్పత్తులు తీసుకోకపోవడం ఉత్తమం. బాగా వేయించిన ఆహారాలు, మాంసం కొవ్వు, అధిక కొవ్వు, కలిగిన వాటిని వీలైనంత వరకు అవైడ్ చెయ్యడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.