Site icon NTV Telugu

Health Tips: వర్షాకాలంలో వీటిని తప్పక తీసుకోవాలి..ఎందుకంటే?

Rain Season Food

Rain Season Food

వర్షాకాలం వచ్చిందంటే చాలు కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.. అయితే ఈ కాలం వచ్చే వ్యాధుల నుంచి బయట పడాలంటే మాత్రం ఆల్ బుకరా కాయలను తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. అసలు ఈ కాయలను తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆల్ బుకరా పండ్ల ల్లో మన శరీరాని కి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల ఆల్ బుకరా పండ్లల్లో 87 గ్రాముల నీటిశాతం ఉంటుంది. 11 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 44 క్యాలరీల శక్తి , ఒకటిన్నర గ్రాముల పీచు పదార్థాలు ఉన్నాయి. ఈ పండ్లల్లో తక్కువ శక్తి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వర్షాకాలం లో ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. వర్షాకాలం లో చాలా మంది జబ్బుల బారిన పడుతూ ఉంటారు. ఈ పండ్లను తీసుకోవడం వల్ల వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అంటువ్యాధులు, జబ్బులు రాకుండా ఉంటాయి.. వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

జ్వరం కూడా త్వరగా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.. ఎముకల కు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు రోజూ రెండు పూటలా వీటిని తీసుకోవడం మంచిది.. ఇక శరీరం లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పండ్ల ను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.. మల బద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే ఈ పండ్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.. అదే విధంగా జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Exit mobile version