NTV Telugu Site icon

Health Tips : చలికాలంలో వీటిని తీసుకుంటే చాలు..అద్భుతమైన ఆరోగ్యమైన ప్రయోజనాలు మీసొంతం..

Smoothies

Smoothies

చలికాలం వచ్చిందంటే చాలు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. అప్పుడే మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.. ఇక ఆహారం మాత్రమే కాదు.. ఆరోగ్యమైన స్మూతిలను కూడా చేసుకొని తాగవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి స్మూతిలను తాగితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పండ్లు, కూరగాయలు, పెరుగు, పాలతో స్మూతీలను సులభంగా తయారు చేయవచ్చు. చాలామంది ఓట్ మీల్ స్మూతీస్ కూడా తాగుతారు. ఇది కడుపుని కూడా నింపుతుంది.. ఇలా చేసుకొని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..

స్మూతీస్‌లో అల్లం కూడా వేసుకోవచ్చు . చలికాలంలో అల్లం తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. ఉదర సమస్యలను తగ్గిస్తుంది.. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది…

అలాగే దాల్చిన చెక్క పొడిని స్మూతిస్ లలో వేసుకొని తాగితే చాలా మంచిది.. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించి, చలికాలంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాల్చినచెక్క శరీర మంటను తగ్గించడానికి, అదనపు కేలరీలను ఖర్చు చేయడానికి కూడా సహాయపడుతుంది.. రోజూ తాగడం వల్ల సులువుగా బరువును తగ్గుతారు..

అలాగే గుమ్మడి గింజలను కలపవచ్చు. ఈ గింజల్లో విటమిన్లు, ఫైబర్ ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది..

స్మూతీలో తేనెను జోడించవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా, తేనెలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. స్మూతీలో చిటికెడు జాజికాయ పొడిని కలుపుకోవచ్చు. ఈ మసాలాలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.. వీటివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.. వీటిని ఒక్కసారి ట్రై చెయ్యండి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments