NTV Telugu Site icon

Health Tips : బ్లాక్ క్యారెట్ లను ఇలా తీసుకుంటే చాలు.. ఎన్ని ప్రయోజనాలో…

Black Carrots

Black Carrots

సాదారణంగా క్యారెట్స్ ఎరుపు రంగులో ఉంటాయి.. కానీ ఇప్పుడు మనం చెప్పుకొనే క్యారెట్స్ నలుపు రంగులో ఉన్నాయి.. క్యారెట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శీతాకాలంలో దాని వినియోగం అనేక తీవ్రమైన వ్యాధులను దూరంగా ఉంచుతుంది.. ఇంకా ఎన్నో రోగాలను నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వీటిలో ఫైబర్, పొటాషియం, విటమిన్-ఎ, విటమిన్-సి, మాంగనీస్, విటమిన్-బి వంటి అనేక పోషకాలు బ్లాక్ క్యారెట్‌లో ఉన్నాయని, అందువల్ల చలికాలంలో బ్లాక్ క్యారెట్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. అందువల్ల ఈ సీజన్‌లో మీ ఆహారంలో బ్లాక్ క్యారెట్‌లను చేర్చుకోండి…

దీనిని తినడం వల్ల గుండెకు చాలా మేలు చేస్తుంది. హృద్రోగులు చల్లని వాతావరణంలో నల్ల క్యారెట్లను తప్పనిసరిగా తినాలి. ఇందులో ఆంథోసైనిన్ ఉందని, ఇది గుండెను దృఢంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది..

నల్ల క్యారెట్ కళ్ళకు కూడా ఒక వరం. దాని వినియోగం కంటి చూపును మెరుగుపరుస్తుంది. అద్దాలను తొలగించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది…

కళ్ళకు కూడా ఒక వరం. దాని వినియోగం కంటి చూపును మెరుగుపరుస్తుంది. అద్దాలను తొలగించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది.

అదే విధంగా రక్తాన్ని శుద్ధి చేస్తుందని, రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. ఇటువంటి పరిస్థితిలో రక్తహీనత రోగులు వారి ఆహారంలో బ్లాక్ క్యారెట్‌ను చేర్చుకుంటే ఎటువంటి సమస్యలు మన దరి చేరవు..

ఇకపోతే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు నల్ల క్యారెట్లను తప్పనిసరిగా తినాలి.. ఇలా ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది.. ట్రై చెయ్యండి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.